News
News
X

Taraka Ratna Health - Balakrishna : తారకరత్నను కంటికి రెప్పలా కాపాడుతున్న బాలకృష్ణ - మృత్యుంజయ మంత్రంతో

కుప్పంలోని ఆస్పత్రిలో కొద్ది క్షణాల పాటు తారక రత్న గుండె కొట్టుకోవడం ఆగిందా? గతంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తాజాగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపిన వివరాలు ఆ విధంగా ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Taraka Ratna Health Update : నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందనే విషయం వాస్తవమే. అయితే, ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఖండించింది. అది పక్కన పెడితే... తారక రత్న గుండె కొట్టుకోవడం ఆగిందనేది మరో కథనం. దీనిపై గతంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తాజాగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపిన వివరాలు, మాట్లాడిన మాటలు వింటే ఆ విధంగా అనిపించక మానదు. 

దగ్గరుండి చూసుకుంటున్న బాలకృష్ణ
కుప్పంలో తారక రత్న కుప్పకూలిన సమయం నుంచి బెంగళూరు వెళ్ళే వరకు... ఇప్పుడు ఈ క్షణం వరకు కన్న కుమారుడి కంటే ఎక్కువగా, కంటికి రెప్పలా నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) చూసుకుంటున్నారు. వైద్యులతో నిరంతరం మాట్లాడుతూ చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అటు కుటుంబ సభ్యులకు, ఇటు మీడియాకు అప్ టు డేట్... అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. కుప్పంలో బాలకృష్ణ దగ్గర ఉండి తారక రత్నను చూసుకున్న విషయాన్ని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
 
''బాలయ్య గారు వచ్చిన తర్వాతే తారక రత్నకు రికవరీ అయ్యింది. ఇదొక మిరాకిల్ ఆ, ఏదో... నాకు అయితే అర్థం కావడం లేదు. అక్కడ నేను ఉన్నాను. ఆల్మోస్ట్ డాక్టర్లు అయ్యిపోయిందని చెప్పిన సమయంలో బాలయ్య గారు వచ్చారు. అప్పటికి అప్పుడు రికవరీ కావడం మిరాకిల్'' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తాజాగా తుమ్మల ప్రసన్న కుమార్ సైతం అదే విధంగా మాట్లాడారు. హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు.

రోజు రోజుకీ ఆరోగ్య పరిస్థితి బావుంటోంది
రోజు రోజుకీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, వైద్య చికిత్సకు ఆయన స్పందించడంతో పాటు కోలుకుంటున్నారని తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. ఒక దశలో తారక రత్న గుండె ఆగిందనుకున్న సమయంలో బాలకృష్ణ పిలుపునకు స్పందించారని, అప్పుడు బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చదవడంతో మళ్ళీ పల్స్ స్టార్ట్ అయ్యిందని, అదొక మెడికల్ మిరాకిల్ అని ప్రసన్న కుమార్ చెప్పారు. ఈ రోజు తారక రత్న జీవించి ఉన్నారంటే, కోలుకుంటున్నారంటే కారణం నూటికి నూరుపాళ్ళూ బాలకృష్ణ కారణమని చెప్పారు. 

ప్రమాదం లేదన్న చిరంజీవి
ఈ రోజు ఉదయం తారక రత్న ఆరోగ్యం (Taraka Ratna Health) గురించి చిరంజీవి (Chiranjeevi) కూడా ట్వీట్ చేశారు. ''సోదరుడు తారక రత్న త్వరగా కోలుకుంటున్నారు. 'ఇక ఏ ప్రమాదం లేదు' అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అతను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ... ఈ పరిస్థితి నుంచి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. డియర్ తారక రత్న... నీకు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

Also Read : ఐదు రోజుల్లో 'కేజీఎఫ్ 2', 'బాహుబలి' రికార్డులు తుడిచిపెట్టిన షారుఖ్ 'పఠాన్'

బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్ళి తారక రత్నను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ గానీ, నందమూరి కళ్యాణ్ రామ్ గానీ, ఇతర కుటుంబ సభ్యులు గానీ పాజిటివ్ గా స్పందించారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకుంటున్నారని తెలిపారు. తారక రత్న త్వరగా కోలుకుని ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు రావాలని అభిమానులు, ప్రేక్షకులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. 

Also Read : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

Published at : 31 Jan 2023 02:15 PM (IST) Tags: Balakrishna mrityunjaya mantra Taraka Ratna Health Prasanna Kumar

సంబంధిత కథనాలు

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

Janaki Kalaganaledu April 1st:  రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Mahesh Babu Vacation : హమ్మయ్యా, మహేష్ బాబుకు కొంచెం రెస్ట్ ఇస్తున్న త్రివిక్రమ్!

Mahesh Babu Vacation : హమ్మయ్యా, మహేష్ బాబుకు కొంచెం రెస్ట్ ఇస్తున్న త్రివిక్రమ్!