By: ABP Desam | Updated at : 19 Jan 2023 06:31 PM (IST)
జైలర్ సినిమాలో తమన్నా (Image Credits: Sun Pictures Twitter)
Jailer: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ‘జైలర్’ సెట్స్‌లో తమన్నా జాయిన్ అయిందని పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్ కొంచెం వయసు మళ్లిన పాత్రలో కనిపిస్తున్నాడు. కాబట్టి సూపర్ స్టార్‌కు తమన్నా జోడీగా కనిపించనుందా? లేకపోతే ఏదైనా ఇతర కీలక పాత్రకు తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ పోస్టర్‌లో తమన్నా చాలా అందంగా కనిపిస్తుంది. ‘జైలర్’కు ‘కోకో కోకిల’, ‘డాక్టర్’, ‘ బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నటుడు సునీల్ కూడా ‘జైలర్’లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం రెండు రోజుల క్రితమే వెల్లడించింది.
సౌత్ ఇండియాలోని అన్ని పరిశ్రమల నుంచి టాప్ స్టార్స్ ఈ సినిమాలో కనిపించనున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే వీరివి గెస్ట్ రోల్స్‌నా లేకపోతే కీలక పాత్రలా అనేది తెలియాల్సి ఉంది. ఈ టాప్ స్టార్లతో పాటు రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, యోగి బాబు, సునీల్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. సునీల్ ఇందులో నెగిటివ్ షేడ్ ఉన్న సీరియస్ పాత్రలో కనిపించనున్నాడని ఆయన పోస్టర్ చూసి చెప్పవచ్చు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ వీడియోను సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది డిసెంబర్ 12వ తేదీన విడుదల చేశారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ పాత్రలో కనిపించనున్నారు. ఒక సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో ‘జైలర్’ కథ జరగనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోనే ఎంతో డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా 2023 ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 'జైలర్' సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటిస్తున్నారు. గతంలో వీళ్లిద్దరి కలయికలో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో 'నరసింహ' ఎవర్ గ్రీన్ ఫిల్మ్. ఆ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన రోల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఇప్పటికీ రమ్యకృష్ణ బెస్ట్ రోల్స్ అంటే నీలాంబరి పాత్ర పేరే చాలా మంది చెప్తారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత రజనీతో రమ్యకృష్ణ సినిమా చేస్తున్నారు.
.@tamannaahspeaks from the sets of #Jailer
— Sun Pictures (@sunpictures) January 19, 2023
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
SBI Q3 Result: రికార్డ్ సృష్టించిన స్టేట్ బ్యాంక్, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు