News
News
X

Tamannaah Bhatia: సింగిల్‌గా కాదు, ఏడాది పాటు పార్టనర్‌తో ఉంటా - ‘డేటింగ్’పై తమన్నా వ్యాఖ్యలు

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బోల్డ్ కామెంట్స్ చేసింది. ఏడాది పాటు పర్‌ఫెక్ట్ పార్టనర్‌తో ఉండాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది.

FOLLOW US: 

తమన్నా భాటియా.. సౌత్ టు నార్త్ పరిచయం అవసరం లేదని ముద్దుగుమ్మ. అందం, అభినయంతో కలబోసిన అమ్మడు.. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై.. 15 ఏళ్ళు గడుస్తున్నా.. ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా ముందుకు దూసుకెళ్తోంది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పుడు ఎంత గ్లామర్ గా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. తన కెరీర్ లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది.

ఒకవైపు స్టార్ హీరోలతో జతకడుతూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లతోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి ‘ప్లాన్-ఏ,  ప్లాన్-బి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిరీస్ లో తమన్నా ఒక మ్యాచ్ మేకర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే,  తాను మాత్రం పెళ్లి అనే పదానికి దూరంగా ఉండాలి అనుకునే అమ్మాయిగా నటిస్తుందట. అలాంటి అమ్మాయికి, ఒక విడాకులు ఇప్పించే లాయర్ కి మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కుతుందట.  

ఈ సందర్భంగా తమన్నా..  టిండర్ ఇండియాను ప్రమోట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడాది పాటు పర్‌ఫెక్ట్ పార్టనర్‌తో ఉండాలని తన మనసులో మాట చెప్పింది. ఇంతకీ తను ఈ సమాధానం చెప్పడానికి ఓ కారణం ఉంది. టిండర్ ఇండియా యాంకర్ ప్లాన్-ఏ, ప్లాన్-బీ అనే రెండు ప్రశ్నలు అడుగుతుంది. ప్లాన్-ఏలో భాగంగా  ఏ పార్టనర్ లేకుండా ఐదు సంవత్సరాలు ఒంటరిగా ఉండాలని ఉందా?  ప్లాన్-బీలో భాగంగా ఏడాది పాటు పర్‌ఫెక్ట్ పార్టనర్‌తో ఉండాలని ఉందా? అని అడిగితే..  ఏమాత్రం తడబాటులేకుండా ప్లాన్-బీ అని చెప్పింది మిల్కీ బ్యూటీ.

View this post on Instagram
 
A post shared by Tinder India (@tinder_india)

News Reels

ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. 2005లో 15 సంవత్సరాల వయస్సులో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రాలో నటించింది.  అదే సంవత్సరం ఆమె’ శ్రీ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.  తెలుగులో ఆమెకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మొదటి విజయాన్ని అందించింది. ఇక 2011లో 100% లవ్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా రచ్చ , ఎందుకంటే... ప్రేమంట! , రెబల్ , కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలతో అదరగొట్టింది. బాహుబలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత ఎఫ్-2, ఎఫ్-3తో బాగానే ఆకట్టుకుంది. 

తాజాగా తమన్నా భాటియా  బాలీవుడ్ లో ‘బబ్లీ బౌన్సర్’ అనే కామెడీ డ్రామాను చేసింది.  ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.  ఇక ఈ అమ్మడు చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోళా శంకర్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా తమిళ హిట్ సినిమా వేదాళంకు రీమేక్ గా వస్తున్నది.  

Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ

Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

Published at : 25 Sep 2022 07:42 PM (IST) Tags: Tamannaah Bhatia Plan B Riteish Deshmukh Plan-A Tinder India

సంబంధిత కథనాలు

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Ram Charan New Film: ‘ఉప్పెన’ దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ, కొన్నిసార్లు తిరుగుబాటు అవసరమట!

Ram Charan New Film: ‘ఉప్పెన’ దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ, కొన్నిసార్లు తిరుగుబాటు అవసరమట!

Actress Sri Vidya: ఆట శ్రీవిద్యకు ఏమైంది? ఆమెకు ఎందుకు అలా మారిపోయారు? కన్నీళ్లు పెట్టించే వ్యథ

Actress Sri Vidya: ఆట శ్రీవిద్యకు ఏమైంది? ఆమెకు ఎందుకు అలా మారిపోయారు? కన్నీళ్లు పెట్టించే వ్యథ

Kiara Advani Sidharth Malhotra: ఆ హీరోతో కియారా అద్వానీ పెళ్లి? ఆ పోస్ట్‌తో అయోమయంలో పడేసిన బ్యూటీ

Kiara Advani Sidharth Malhotra: ఆ హీరోతో కియారా అద్వానీ పెళ్లి? ఆ పోస్ట్‌తో అయోమయంలో పడేసిన బ్యూటీ

టాప్ స్టోరీస్

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

Viral Video: స్టన్నింగ్ వీడియో- బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు ఎక్కించాడు!

Viral Video: స్టన్నింగ్ వీడియో- బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు ఎక్కించాడు!