Taapsee Pannu: పెళ్లికి లెహంగా ఎందుకు వేసుకోలేదో చెప్పిన తాప్పీ
Taapsee Pannu: తాప్సీ.. ఈ మధ్యే పెళ్లి చేసుకుంది . ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకండా ప్రైవేట్ వెడ్డింగ్ చేసుకుంది సొట్ట బుగ్గల చిన్నది. ఇప్పుడు పెళ్లికి లెహంగా ఎందుకు వేసుకోలేదో చెప్పింది.
Taapsee Pannu About Her Wedding Dress: పెళ్లి అంటే.. ప్రతి ఒక్కరు ఓ రేంజ్ లో రెడీ అవుతారు. పెళ్లి కూతురు స్పెషల్ గా కనిపించాలని రకరకాల నగలు వేసుకుని భలే అందంగా ముస్తాబు అవుతుంది. నార్త్ సైడ్ వాళ్ల అయితే, భారీ భారీ లెహంగాలు డిజైన్ చేయించుకుంటారు. హీరోయిన్ల గురించైతే చెప్పక్కర్లేదు. ఒక రేంజ్ లో ఉంటాయి వాళ్ల పెళ్లి ఔట్ ఫిట్స్. అయితే, తాప్పీ మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచించారు. రెడ్ పంజాబి డ్రెస్ లో ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆమె లెహంగా కాకుండా డ్రెస్ లో ఎందుకు పెళ్లి చేసుకున్నారో రీజన్ చెప్పారు ఈ మధ్య.
వింటేజ్ ఐడియా..
2024, మార్చి 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో హీరోయిన్ టాప్సీ.. తన బాయ్ ఫ్రెండ్ మథియా బోను వివాహం చేసుకుంది. చాలా కొద్దిమంది మధ్య, ప్రైవేట్ వెడ్డింగ్ నిర్వహించారు. అయితే, తాప్సీ తన పెళ్లిలో లెహంగా కాకుండా రెడ్ కలర్ డ్రెస్ లో కనిపించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, దానికి రీజన్ చెప్పింది తాప్సీ. "నేను సిక్, గురుద్వార పెళ్లిలు చూసి పెరిగాను. నాది వింటేజ్ ఐడియా, రెండ్ కలర్ సల్వార్ కమీజ్ లో, దుప్పట, కినారి బోర్డర్ తో పెళ్లి చేసుకోవాలి అనేది నా క్లాసిక్ ఐడియా. అప్పుడే పెళ్లి కూతురు పెళ్లి కూతురిలా కనిపిస్తుంది అని నాకు అనిపించింది. `లెహంగాలో పెళ్లి చేసుకుంటే అది నాకు రియల్ వెడ్డింగ్ ఫీల్ కిలిగించదు" అని చెప్పారు తాప్సీ.
నా ఫ్రెండ్ డిజైన్ చేసింది..
తన పెళ్లి బట్టలన్నీ తన కాలేజ్ ఫ్రెండ్ మని భాటియా డిజైన్ చేసినట్లు చెప్పారు తాప్సీ. ఎవరైనా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కి ఇస్తే.. న్యూస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందని, అందుకే తన ఫ్రెండ్ కి ఇచ్చినట్లు చెప్పారు ఆమె. "నా పెళ్లి తంతు మొత్తంలో నేను లెహంగా అసలు వేసుకోలేదు" అని అన్నారు తాప్సీ.
డ్యాన్స్ వేసేందుకు వీలుగా..
పెళ్లి మొత్తాన్ని ఎంజాయ్ చేయాలని, డ్యాన్స్ వేస్తూ ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలని అనుకుందట తాప్సీ. లెహంగా అయితే, కంఫర్ట్ గా ఎంజాయ్ చేయలేనని, అందుకే అలా సల్వార్ కమీజ్ కి ఫిక్స్ అయ్యానని అన్నారు. చాలా ఫ్రీగా ఎంజాయ్ చేయగలిగానని చెప్పుకొచ్చారు.
"నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అందరికీ చెప్పాల్సిన పని లేదని అనిపించింది. అందుకే నా వరకే పెట్టుకున్నాను. సీక్రెట్ గా ఉంచాలనేది ఇన్టెన్షన్ కాదు. పబ్లిక్ అఫైర్ చేయొద్దని అనుకున్నాను. ఎందుకంటే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచించాల్సి వస్తుంది కదా అందుకే" అని తను ప్రైవేట్ వెడ్డింగ్ చేసుకున్నందుకు రీజన్ చెప్పారు తాప్సీ.
గత కొన్ని ఏళ్లుగా వెబ్ సిరీస్, సినిమాల్లో బిజీగా ఉన్న తాప్సీ ఈ ఏడాది మార్చి 22న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. ఫొటోలు కూడా కనీసం తాప్సీ షేర్ చేయలేదు. కేవలం.. ఆమె వెడ్డింగ్ ప్లానర్స్ మాత్రమే కొన్ని ఫొటోలు షేర్ చేశారు.