By: ABP Desam | Updated at : 16 Feb 2023 07:41 PM (IST)
భర్త ఫహాద్ జిరార్ అహ్మద్‌తో స్వర భాస్కర్
Swara Bhasker Wedding: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ వార్తను స్వయంగా స్వర భాస్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ జిరార్ అహ్మద్‌ను ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకుంది.
దీని గురించి సమాచారం ఇస్తూ స్వర భాస్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. స్వర తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రెండు నిమిషాల నాలుగు సెకన్ల నిడివి ఉన్న వీడియోను షేర్ చేశారు. ఫహద్ జిరార్‌తో తన బంధం ఎలా మొదలైంది, ఎలా పెళ్లి వరకు వచ్చింది అనే వివరాలు షేర్ చేసింది.
భర్త ఫహద్ జిరార్ కోసం స్పెషల్ నోట్
నటి స్వర భాస్కర్ ఒక వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు ఫహాద్ జిరార్ అహ్మద్ కోసం ఒక అందమైన నోట్‌ను షేర్ చేశారు, అందులో ఆమె ఇలా వ్రాసింది, 'కొన్నిసార్లు మన పక్కనే ఉన్న దాని కోసం మనం చాలా దూరం వెతుకుతాం. మేం ప్రేమ కోసం వెతికాం. కానీ మొదట స్నేహాన్ని కనుగొన్నాం. తరువాత ఒకరినొకరు కనుగొన్నాము. ఫహద్ జిరార్ అహ్మద్‌కు నా హృదయంలోకి స్వాగతం. నా హృదయం కొంచెం గందరగోళంగా ఉంటుంది. కానీ అది నీదే’ అని పోస్ట్ చేశారు.
కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు
ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ స్వర భాస్కర్ అభిమానులు ఆమె వివాహానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒక యూజర్ 'మీ ఇద్దరికీ అభినందనలు' అని రాశారు. మరొకరు షాదీ ముబారక్ అని కామెంట్ చేశారు. మరో యూజర్ 'అందమైన జంటకు అభినందనలు' అని వ్యాఖ్యానించారు.
రచయిత హిమాన్షు శర్మతో స్వర భాస్కర్‌కు ఉన్న సంబంధం గురించి ఇంతకుముందు వార్తలు తెరపైకి వచ్చాయి. రాంఝనా సినిమా సెట్స్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. స్వర భాస్కర్, హిమాన్షు శర్మ ఒకరితో ఒకరు 5 సంవత్సరాలు డేటింగ్ చేశారని, అయితే ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదని వార్తలు వచ్చాయి. దీని తరువాత 2019 సంవత్సరంలో స్వర, హిమాన్షు పరస్పర అంగీకారంతో విడిపోయారు.
I never knew chaos can be so beautiful ❤️
— Fahad Ahmad (@FahadZirarAhmad) February 16, 2023
Thank you for holding my hand love @ReallySwara 😘😘 https://t.co/ivKVsZrMyx
Sometimes you search far & wide for something that was right next to you all along. We were looking for love, but we found friendship first. And then we found each other!
— Swara Bhasker (@ReallySwara) February 16, 2023
Welcome to my heart @FahadZirarAhmad It’s chaotic but it’s yours! ♥️✨🧿 pic.twitter.com/GHh26GODbm
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్