అన్వేషించండి

'ఊరు పేరు భైరవకోన'.. ఊర్లోకి రావడమే కానీ, బయటకు పోవడం ఉండదు

వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఊరు పేరు భైరవకోన' టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ను క్రియేట్ చేస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Ooru Peru Bhairavakona: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, స్పెషల్ మేకింగ్ వీడియోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా.. వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. సస్పెన్స్ అండ్ ఉత్కంఠను రేకెత్తించే ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన 'ఊరు పేరు భైరవకోన'లో హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన మూవీ టీజర్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ టీజర్ లో శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణానికి, ఇప్పటి గరుడపురాణంకు నాలుగు పేజీలు తగ్గాయనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చారు. ఆ నాలుగు పేజీలే భైరవ కోన అంటూ టీజర్‌తోనే సినిమా స్టోరీని చెప్పేశారు. అయితే ఆ మాయమైన పేజీల్లో ఏమున్నాయి. అసలు భైరవకొనలో ఏం జరుగుతుంది అనే అంశాలతో సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. టీజర్‌లో ఈ ఊరిలోకి రావడమే కానీ, బయటకు పోవడం ఉండదంటూ వచ్చిన డైలాగ్‌ విపరీతమైన క్యూరియాసిటీ పెంచుతోంది. దర్శకుడు విఐ ఆనంద్‌ చాలా కాలం తర్వాత తనకు ఎంతో ఇష్టమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో సినిమా చేస్తుండటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఈ టీజర్ గురించి చెప్పాలంటే.. మూవీకి శేఖర్‌ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేదిలా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు స్పెషల్ హైలెట్ గా నిలుస్తోంది. అద్భుతంగా తీసిన నైట్ షాట్స్.. మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. 2022 మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మేకర్స్.. సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా’ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను 2023 మార్చి 31న విడుదల చేశారు. ఈ సాంగ్ కు కూడా ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణే లభించింది. ఇదిలా ఉండలా.. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఊరు పేరు భైరవకోనలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇక హీరో సందీప్ కిషన్ గురించి చెప్పాలంటే.. కొంత కాలంగా హిట్లకు దూరమై విజయం వైపుకు అడుగులు వేస్తున్నారు. ఎన్ని సినిమాలు చేసినా.. బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తుండడం మరో చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. ఇటీవల ఆయన చేసిన 'మైఖేల్' సైతం తొలిరోజే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుని బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు చేయబోయే 'ఊరు పేరు భైరవకోన'పైనే ఆశలు పెట్టుకున్నారు సందీప్ కిషన్. ఇప్పటివరకైతే ఈ సినిమా మీ మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను భైరవకోన అందుకుంటుందా.. లేదా ఇదీ ఫ్లాప్ ల జాబితాలో పడిపోతుందా అన్నది వేచిచూడాల్సిందే.

టాప్ హెడ్ లైన్స్

Haiku Movie OTT : లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి - ఓటీటీలోకి శ్రీదేవి లవ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి - ఓటీటీలోకి శ్రీదేవి లవ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nindu Noorella Saavasam Serial Today November 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చూసిన మనోహరి – భయపడ్డ భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చూసిన మనోహరి – భయపడ్డ భాగీ
Bigg Boss Season 10 Today November 14th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: జీరో వర్షిణికి.. బంఫర్ ఆఫర్! నా బిడ్డా.. నా బిడ్డా అంటూ ఆర్కే తల్లి ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: జీరో వర్షిణికి.. బంఫర్ ఆఫర్! నా బిడ్డా.. నా బిడ్డా అంటూ ఆర్కే తల్లి ఎమోషనల్!
NTR Anil Ravipudi : ఎన్టీఆర్ అనిల్ రావిపూడి ఫుల్ కామెడీ ట్రీట్ - టైటిల్ ఏమై ఉంటుందో?
ఎన్టీఆర్ అనిల్ రావిపూడి ఫుల్ కామెడీ ట్రీట్ - టైటిల్ ఏమై ఉంటుందో?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget