News
News
వీడియోలు ఆటలు
X

Jailer: చిరు వర్సెస్ రజనీ - ‘జైలర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది - ‘భోళా శంకర్’తో క్లాష్!

రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

FOLLOW US: 
Share:

Jailer Release Date: సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘జైలర్’ విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతుంది. ‘జైలర్’ తెలుగులో కూడా విడుదల అవుతుంది కాబట్టి ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పదు. ‘జైలర్’ రిలీజ్ డేట్‌ను గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. ఈ గ్లింప్స్‌లో స్టార్ కాస్ట్ మొత్తాన్ని చూపించారు. చాలా భారీ స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఆగస్టు 11వ తేదీన తమిళంలో శివ కార్తికేయన్ నటిస్తున్న ‘మావీరన్’ కూడా విడుదల కానుంది. అయితే ‘జైలర్’ డేట్ ఇవ్వడంతో ఈ సినిమా జులైకి ప్రీపోన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ‘మావీరన్’ తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో విడుదల అవుతుంది. ‘మావీరన్’, ‘జైలర్’ రెండు సినిమాల్లోనూ తెలుగు నటుడు సునీల్ నటిస్తుండటం విశేషం.

సౌత్ ఇండియాలోని అన్ని పరిశ్రమల నుంచి టాప్ స్టార్స్ ఈ సినిమాలో కనిపించనున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే వీరివి గెస్ట్ రోల్స్‌నా లేకపోతే కీలక పాత్రలా అనేది తెలియాల్సి ఉంది. ఈ టాప్ స్టార్లతో పాటు రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, యోగి బాబు, సునీల్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. సునీల్ ఇందులో నెగిటివ్ షేడ్ ఉన్న సీరియస్ పాత్రలో కనిపించనున్నాడని ఆయన పోస్టర్ చూసి చెప్పవచ్చు. కానీ సునీల్ పోస్టర్‌లో ఒక లుక్‌లోనూ, గ్లింప్స్‌లో మరో లుక్‌లోనూ కనిపిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్ వీడియోను సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది డిసెంబర్ 12వ తేదీన విడుదల చేశారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ పాత్రలో కనిపించనున్నారు. ఒక సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో ‘జైలర్’ కథ జరగనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోనే ఎంతో డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా 2023 ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 'జైలర్' సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటిస్తున్నారు. గతంలో వీళ్లిద్దరి కలయికలో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో 'నరసింహ' ఎవర్ గ్రీన్ ఫిల్మ్. ఆ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన రోల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఇప్పటికీ రమ్యకృష్ణ బెస్ట్ రోల్స్ అంటే నీలాంబరి పాత్ర పేరే చాలా మంది చెప్తారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత రజనీతో రమ్యకృష్ణ సినిమా చేస్తున్నారు.

Published at : 04 May 2023 06:31 PM (IST) Tags: Rajinikanth Anirudh Ravichander Nelson Dilipkumar Jailer Jailer Release Date

సంబంధిత కథనాలు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?

అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం