News
News
X

Krishna Last Interview: ఎన్టీఆర్ చేయట్లేదని నేనే చేసేశా, ఆ తర్వాత 12 ఫ్లాప్‌లతో అవకాశాలు రాలేదు - కృష్ణ చివరి ఇంటర్వ్యూ ఇదే

కృష్ణ కూతురు మంజులు చేసిన ఇంటర్వ్యూలో ఆయన తన అనుభవాలను వెల్లడించారు. ఇదే ఆయన చివరి ఇంటర్వ్యూ కావడం బాధాకరం.

FOLLOW US: 

సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని పుట్టిన రోజు (మే, 31న) సందర్భంగా ఆయన కుమార్తె మంజులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘అల్లూరి సీతారామారాజు’ సినిమా తన కెరీర్ మీద ఎంత ప్రభావం చూపిందో వివరించారు. అయితే, కృష్ణకు ఇదే చివరి ఇంటర్వ్యూ కావడం గమనార్హం.

అల్లూరి సీతారామరాజు సినిమా ఎన్టీఆర్ చేస్తారని చూశా

‘‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్.టి.రామారావుగారు అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తానని ప్రకటించారు. సినిమాలో హీరో అయ్యాక ఓసారి నాకు అల్లూరి సీతారామరాజు వేషం వేశారు. ఆ గెటప్‌లో నేను ఒదిగిపోయానని చెప్పారు. ఎన్నాళ్లైనా రామారావుగారు ‘అల్లూరి’ సినిమా తీయకపోతే నేనే చేసేశా. దర్శకుడు, నిర్మాత చక్రపాణి ఆ సినిమా చూసిన తర్వాత.. నీతో ఎంతమంది సినిమాలు చేస్తున్నారని అడిగారు. ఏడు ఎనిమిది మంది చేస్తున్నారు. ఇంకో ఆరేడు మంది వెయిటింగ్‌లో ఉన్నారని చెప్పా. ఇక వాళ్లు నీతో సినిమా చేయరని చెప్పేశారు. ఈ సినిమా చేశాక నువ్వు ఎంత యాక్ట్ చేసినా రెండుమూడేళ్లు నీకు హిట్ రాదని చెప్పారు. ఆయన చెప్పినట్లే.. 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. 

ఇక కృష్ణ అయిపోయాడనే సందర్భంలో ‘పాడిపంటలు’ ఆదుకుంది

ఆ 12 చిత్రాలు చాలామంచి సినిమాలు. ఆ ఫ్లాప్స్ తర్వాత నన్ను హీరోగా బుక్ చేయడం మానేశారు. దీంతో సొంత బ్యానర్‌పై పాడిపంటలు సినిమా తీశాం. ఎంతో కష్టపడి ఆ సినిమా తీశాం. ఇక కృష్ణ అయిపోయాడు అనుకొనే సందర్భంలో ‘పాడి పంటలు’ సినిమా అల్లూరి సీతారామారాజు సినిమా కంటే మంచి హిట్ కొట్టింది. మళ్లీ నాకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది’’ అని తెలిపారు. 

చత్రపతి శివాజీ పాత్ర అందుకే చేయలేదు

‘‘నాకు చత్రపతి శివాజీ పాత్రలో నటించాలని ఉండేది. అయితే, చత్రపతి మహ్మదీయులకు వ్యతిరేకులు. మహ్మదీయుల మనోభావాలను దెబ్బతీయడం ఎందుకని ఆ సినిమా చేయలేదు. కానీ, రెండు సినిమాల్లో ఆ వేషం ధరించి ప్రజలకు కనిపించాను’’ అని తెలిపారు. 

News Reels

నాన్నా, నీలోటు పూడ్చలేనిది!

కృష్ణ  మరణం అనంతరం కూమార్తె మంజుల ఘట్టమనేని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నివాళి అర్పించారు. ఆయన మరణం ఎప్పటికీ పూడ్చలేని నష్టంగా అభివర్ణించారు. కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆర్వాత.. తండ్రితో కలిసి ఉన్న ఫోటో పెట్టి ‘డియరెస్ట్ నాన్నా’ అంటూ తన బాధను అక్షరాల రూపంలో వ్యక్తం చేశారు.  “మీరు ప్రపంచానికి సూపర్ స్టార్ కావొచ్చు. కానీ, ఇంట్లో మీరు ప్రేమగల, సాదాసీదా తండ్రివి. నువ్వు మా కోసం కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నావు. మీ బిజీ షెడ్యూల్‌లలో కూడా..  మీరు మాకు కావాల్సినవన్నీ అందించారు. మా కోసం ఎప్పుడూ గడిపేందుకు ప్రయత్నించే వాడివి.  జీవితాన్ని ఎలా జీవించాలో మీరు మాకు ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. మీరు, మీ పనుల ద్వారానే అ విషయాలను మాకు నేర్పారు. మీ సరళత, సౌమ్యత, వివేకం, క్రమశిక్షణ, సమయపాలన, దాతృత్వం అసమానమైనవి. సినిమాకి మీ వారసత్వం అపారమైన సహకారం శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది” అని మంజుల వెల్లడించింది.

Also Read: కృష్ణ అసలు పేరు అలా మారింది - ఒకేసారి 20 సినిమా అవకాశాలు తెచ్చిన ఆ చిత్రం ఏమిటో తెలుసా?

Published at : 15 Nov 2022 10:10 AM (IST) Tags: Krishna Health Condition Krishna First Movie Mahesh Babu Father Death Krishna Death Super Star Krishna Death Krishna last Interview

సంబంధిత కథనాలు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'