Sunil Babu Death: విషాదంలో ‘వారసుడు’ టీమ్ - ఆర్ట్ డైరెక్టర్ మృతి
విజయ్ హీరోగా తెలుగు, తమిళ చిత్రంలో రూపొందిన ‘వారసుడు’ మూవీకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సునీల్ గురువారం గుండెపోటుతో మరణించారు.

తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారీసు’) మూవీ ఈ సంక్రాంతికి విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీకి ఆర్ట్ డైరెక్టరుగా పనిచేసిన సునీల్(50) గుండెపోటుతో మరణించారు. దీంతో ‘వారసుడు’ చిత్రయూనిట్ విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ‘వారసుడు’కు ముందు సునీల్ బాబు ‘బెంగళూరు డేస్’, ‘గజినీ’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభకు పలు అవార్డులు కూడా వరించాయి. గురువారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన్ని కేరళలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు వెంటనే చికిత్స అందించినా.. ప్రాణాలను కాపాడలేకపోయారు.
సునీల్ బాబు మృతిపై ‘బెంగళూరు డేస్’ దర్శకురాలు అంజలీ మీనన్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సునీల్ బాబు ఇక లేరని తెలిసి షాకయ్యా. ‘బెంగళూరు డేస్’ కోసం మేమిద్దరం కలిసి పనిచేశాం. ఆ రోజుల్లోని అద్భుతమైన జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను మిత్రమా. రెస్ట్ ఇన్ పీస్ సునీల్’’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నివాళులు అర్పించారు.
Also Read: స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయిన ప్రభాస్ - కన్నీళ్లు ఆపుకోలేక!
View this post on Instagram
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















