Michael Trailer : 'మైఖేల్' ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ - సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్
Michael Movie Trailer Release Date : సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' (Michael Movie). ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆయనది స్పెషల్ యాక్షన్ రోల్. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్‌గా నటించారు. అతి త్వరలో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
జనవరి 21న 'మైఖేల్' ట్రైలర్
'మైఖేల్' సినిమా చిత్రీకరణ పూర్తయిందని సంక్రాంతి సందర్భంగా ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది. అంతే కాదు... ఈ నెల 21న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.
ఫిబ్రవరి 3న పాన్ ఇండియా రిలీజ్
Michael Movie Release On Feb 3rd : ఫిబ్రవరి 3న 'మైఖేల్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దివంగత శ్రీ. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు వెల్లడించారు. దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో సినిమా విడుదల కానుంది.
Also Read : సక్సెస్ కోసం సౌత్ సినిమాల వెంట బాలీవుడ్ స్టార్స్!? - బాలీవుడ్‌లో 2023 ఫస్టాఫ్‌లో వస్తున్న సౌత్ రీమేక్స్ ఇవే
View this post on Instagram
24 కిలోలు తగ్గిన సందీప్ కిషన్
'మైఖేల్' తన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో సందీప్ కిషన్ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. సుమారు 24 కిలోల బరువు తగ్గారు. 'మైఖేల్'తో కొత్త ప్రయత్నం చేశామని, తెలుగు ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందని టీజర్ విడుదల కార్యక్రమంలో సందీప్ కిషన్ చెప్పారు. తనకు ఇదే ఆఖరి సినిమా అన్నట్లు దర్శకుడు రంజిత్ జయకోడి సినిమా తీశారని, షూటింగులో హీరో కంటే ఎక్కువ రిస్కులు తీసుకున్నారని ఆయన వెల్లడించారు.
ఆల్రెడీ యాక్షన్ ప్యాక్డ్ టీజర్...
'నువ్వుంటే చాలు' సాంగ్ కూడా!
ఆల్రెడీ 'మైఖేల్' టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 10న విడుదల చేశారు. ఇటీవల సినిమాలో తొలి పాట 'నువ్వుంటే చాలు'ను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాటకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య... పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?
'వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి మైఖేల్' అని మాస్టర్ చెప్పగా ... 'వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడటం తెలియాల్సిన పని లేదు మాస్టర్'' అని మైఖేల్ బదులు ఇవ్వడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు... రొమాన్స్ కూడా ఉందని సందీప్ కిషన్, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ లిప్ లాక్ ద్వారా చెప్పేశారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లుక్స్ కూడా బావున్నాయి.
వరుణ్ సందేశ్ అండ్ అనసూయ!
'మైఖేల్' సినిమాలో 'హ్యాపీ డేస్' ఫేమ్ వరుణ్ సందేశ్, స్టార్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఉన్నారు. సినిమాలో వాళ్ళ పాత్రలు ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ చిత్రానికి మాటలు : త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె సాంబశివరావు, ఛాయాగ్రహణం : కిరణ్ కౌశిక్, సంగీతం : సామ్ సిఎస్, సమర్పణ : నారాయణ్ దాస్ కె. నారంగ్, నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, దర్శకత్వం : రంజిత్ జయకోడి.