అన్వేషించండి

Micheal Trailer: ఇంత వయొలెంట్ సందీప్‌ కిషన్‌ని ఎప్పుడూ చూసి ఉండరు - మైకేల్ ట్రైలర్ ఎలా ఉంది?

సందీప్ కిషన్ హీరో పాన్ ఇండియా సినిమా ‘మైకేల్’ ట్రైలర్ విడుదల అయింది.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మైకేల్’ ట్రైలర్ సోమవారం విడుదల అయింది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది. ఫిబ్రవరి మూడో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా హీరోయిన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ‘ఒక అమ్మాయి కోసం ఇదంతా చేస్తున్నావా మైకేల్’ అని విలన్ అడిగినప్పుడు ‘అవును మాస్టర్. అమ్మాయి కోసం కాకపోతే ఇంక బతకడం ఎందుకు?’ అని సందీప్ కిషన్ అంటాడు. ట్రైలర్‌లో వరుణ్ సందేశ్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మీనన్ ఇలా పూర్తిగా స్టార్ కాస్ట్‌తో నింపేశారు. వరుణ్ సందేశ్ రక్తపు మడుగులో పడి ఉంటే తన పక్కన అనసూయ పడుకుని ఉండే షాట్ ట్రైలర్‌కే హైలెట్ అని చెప్పవచ్చు.

ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను జయం రవి, అనిరుథ్ రవిచందర్ విడుదల చేయగా, మలయాళం ట్రైలర్‌ను నివిన్ పాలీ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా వైడ్‌గా ఎంత క్రేజ్ తీసుకురావాలో అంత క్రేజ్ తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది చిత్ర బృందం.

ఈ సినిమా టీజర్ కూడా ఇటీవలే విడుదలై పెద్ద సక్సెస్ అయింది.  తెలుగులో న్యాచురల్ స్టార్ నాని, తమిళ్ లో హీరో ధనుష్, కన్నడలో రక్షిత్ శెట్టి ఇలా ఒక్కో భాషలో ఒక్కో హీరో టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో సందీప్ కిషన్ లుక్స్ కూడా అదిరిపోయాయి. సందీప్ కిషన్ ను మునుపెన్నడూ చూడని విధంగా ఈ టీజర్ లో చూపించారు.

టీజర్ లో సందీప్ సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. టీజర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే కథలాగా అనిపిస్తుంది. విజువల్స్ లో కూడా కొత్తదనం కనబడుతోంది. డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయి. టీజర్ మధ్యలో వచ్చిన డైలాగ్ అయితే ఓ రేంజ్ లో ఉంది.

‘మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. దానికి హీరో బదులిస్తూ "వెంటాడి ఆకలి తీర్చుకోడానికి... వేటాడటం తెలియల్సిన పనిలేదు మాస్టార్" అని అంటాడు.  అలాగే టీజర్ చివరలో ‘మన్నించేటప్పుడు మనం దేవుడవుతాం మైఖేల్’ అనే డైలాగ్ కు కూడా హీరో బదులిస్తూ  "నేను మనిషిగానే ఉంటా మాస్టార్" అని అంటాడు. ఈ డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తి పెంచాయి.

'మైఖేల్' తన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో సందీప్ కిషన్ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. సుమారు 24 కిలోల బరువు తగ్గారు. 'మైఖేల్'తో కొత్త ప్రయత్నం చేశామని, తెలుగు ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందని టీజర్ విడుదల కార్యక్రమంలో సందీప్ కిషన్ చెప్పారు. తనకు ఇదే ఆఖరి సినిమా అన్నట్లు దర్శకుడు రంజిత్ జయకోడి సినిమా తీశారని, షూటింగులో హీరో కంటే ఎక్కువ రిస్కులు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. 

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
Bigg Boss Season 10 Today Nov 14th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి, రామకృష్ణల్లో ఆ అదృష్టం ఎవరిది? ఇద్దరు అమ్మలను ఏడిపించేశారు కదయ్యా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి, రామకృష్ణల్లో ఆ అదృష్టం ఎవరిది? ఇద్దరు అమ్మలను ఏడిపించేశారు కదయ్యా!
Giri Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
Dhindora Series Season 2 OTT : మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget