Sukumar Chiranjeevi Movie: సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి, ఇందులో చిన్న ట్విస్ట్ ఉందండోయ్!
సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సంగతి నిజమే. కానీ, ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.
![Sukumar Chiranjeevi Movie: సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి, ఇందులో చిన్న ట్విస్ట్ ఉందండోయ్! Sukumar set to direct Megastar Chiranjeevi for An Ad film Sukumar Chiranjeevi Movie: సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి, ఇందులో చిన్న ట్విస్ట్ ఉందండోయ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/76b776fabd49ab2c9c5e9942a9ac4655_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘పుష్ప’ హిట్‌తో మాంచి ఊపుమీదున్న దర్శకుడు సుకుమార్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవికి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. అయితే, ఇందులో చిన్న ట్వి్స్ట్ ఉన్నట్లు సమాచారం.
సుకుమార్ మంగళవారం తన ఇన్‌స్టా్గ్రామ్‌లో చేసిన పోస్ట్ చిరు అభిమానుల్లో సంతోషం నింపింది. ‘‘కల నిజమైంది. మెగాస్టార్ చిరంజీవికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరుతో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. అయితే, ఇద్దరు కలిసి సినిమా తీస్తున్నారని అంతా పండగ చేసుకున్నారు. అయితే, అది సినిమా కాదని, ఓ వాణిజ్య ప్రకటన అనే సమాచారం రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పుకోవాలి.
సుకుమార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌కు ‘రంగస్థలం’ సినిమాతో మాంచి హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సుక్కు ఎక్కువగా అల్లు అర్జున్ సినిమాలకే ఎక్కువ దర్శకత్వం వహించారు. ‘ఆర్య’ నుంచి ‘ఆర్య2’.. ‘పుష్ప: ది రైజింగ్’ సినిమా వరకు మాంచి హిట్లు కొట్టారు. ఈ నేపథ్యంలో చిరంజీవి-సుకుమార్ కాంబోలో కూడా సినిమా వస్తే చూడాలని ఉందంటూ చిరు అభిమానులు ఆశ పడుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే విజయ్ దేవర కొండ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు చిరు కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇంకా ‘భోళాశంకర్’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. మరి సుక్కు-చిరు కాంబోలో వచ్చేది వాణిజ్య ప్రకటనా? లేదా సినిమానా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)