Shilpa shetty: శిల్పా శెట్టి హిట్ మూవీకి సీక్వెల్, స్క్రిప్ట్ పనులు షురూ
Shilpa shetty: ‘సుఖీ’ మూవీతో మంచి హిట్ అందుకుంది అందాల తార శిల్పాశెట్టి. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది.
Shilpa shetty’s Sukhee Sequel: బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శిల్పాశెట్టి. సుమారు మూడు దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందచందాలతో ఆకట్టుకుంటోంది. ‘బాజీగర్’ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శిల్పా, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో సినీ లవర్స్ ను అలరించింది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.
‘సుఖీ’ మూవీతో హిట్ అందుకున్న శిల్పా శెట్టి
శిల్పా శెట్టి రీసెంట్ గా నటించిన సినిమా ‘సుఖీ’. సెప్టెంబర్ 22న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టా్ర్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు సోనాల్ జోషి దర్శకత్వం వహించారు. కుషా కపిల, దిల్నాజ్ ఇరానీ, అమిత్ సాద్, చైతన్య చౌదరి కీలక పాత్రల్లో కనిపించారు. కామెడీ డ్రామా రూపొందిన ఈ మూవీ కథ, ఓ మధ్య తరగతి గృహిణి జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రతి రోజు పిల్లలను రెడీ చేసి స్కూల్ కి పంపడం, భర్తకు క్యారేజీ కట్టి ఆఫీస్ కు పంపించడంతోనే సుఖీ రోజు వారీ జీవితం గడుస్తుంది. సుఖీ ఫ్రెండ్స్ టూర్ ఫ్లాన్ చేస్తారు. ఆమెను వెళ్లవద్దని భర్త చెప్తాడు. అయినా, భర్త మాట వినకుండా వెళ్తుంది. ఫ్యామిలీని వదిలేసి ఫ్రెండ్స్ తో సుఖీ టూర్ కు వెళ్లాక ఏమైంది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథ.
‘సుఖీ’ మూవీకి సీక్వెల్
‘సుఖీ’ సినిమా విమర్శలకు ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. దీంతో మేకర్స్ సీక్వెల్ ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘సుఖీ’ చిత్రానికి కొనసాగింపుగా ‘సుఖీ 2’ను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో శిల్పాశెట్టి కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.
శిల్పాశెట్టి వ్యక్తిగత జీవితంపై బోలెడు రూమర్లు
గత కొంతకాలంగా శిల్పాశెట్టి, ఆమె భర్త విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా రాజ్ కుంద్రా పెట్టిన పోస్టు అందరినీ షాక్ కి గురి చేసింది. “మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి” అని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ఈ ట్వీట్ అప్పట్లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా శిల్పాశెట్టితో విడాకులు తీసుకుంటున్నారా? అని నెటిజన్లు జోరుగా చర్చలు జరిపారు. అయితే, రాజ్ నటించిన ‘UT69’ మూవీ హైప్ కోసమే ఈ ట్వీట్ చేసినట్లు తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ కుంద్రా 2022లో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యారు. దాదాపు 2 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు.
Read Also: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Appl