By: ABP Desam | Updated at : 12 Feb 2023 05:08 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Samskruthifilms/Instagram
సుడిగాలి సుధీర్ హీరోగా పులిచర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గాలోడు‘. గత నవంబర్ 18న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో బాగా ఆడింది. ప్రేక్షకులు ఈ మూవీని బాగానే ఆదరించారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం సుమారు రూ. 10 కోట్లు వసూళు చేసింది. ఇందులో సుధీర్ సరసన గెహన సిప్పి హీరోయిన్ గా నటించింది. భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 17 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ‘ఆహా’ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
సుధీర్ కెరీర్ కు ‘గాలోడు’ బూస్టింగ్
జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత హీరోగా మారాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టాడు. అనంతరం పలు సినిమాల్లో నటించాడు. అయినా, సాలిడ్ హిట్ పడలేదు. ఈ నేపథ్యంలోనే మాస్ ఎంటర్ టైనర్ గా ‘గాలోడు’ తెరకెక్కింది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మాస్ హారోగా కనిపించాడు సుధీర్. తన కెరీర్ లోనే మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ సినిమా సుధీర్ సినీ కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.
‘గాలోడు’ సినిమా కథేంటంటే?
రాజు (సుడిగాలి సుధీర్) పల్లెటూరి కుర్రాడు. ఆ ఊరిలో ఎలాంటి పని చేయకుండా అల్లరి చిల్లరగా తిరుగుతాడు. ఓ రోజు పేకాట ఆడుతుండగా గొడవ అవుతుంది. సర్పంచ్ కొడుకుపై దాడి చేయడంతో అతడు చనిపోతాడు. వెంటనే రాజు ఊరు వదిలి హైదరాబాద్ కు పారిపోతాడు. అక్కడ కాలేజీ అమ్మాయి శుక్లా (గెహనా సిప్పి)ను ఆకతాయిలు ఏడిపిస్తుండగా కాపాడుతాడు. తనను కాపాడిన రాజును ఆమె తన తండ్రికి పరిచయం చేస్తుంది. తన తండ్రి దగ్గరే డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తుంది. అలా వారి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అటు హత్యకు సంబంధించి పోలీసులు రాజును వెతుక్కుంటూ హైదరాబాద్ కు వస్తారు. హత్య కేసులో అతడికి శిక్ష పడుతుంది. ఆ తర్వాత జైలు నుంచి రాజు ఎలా బయటకు వస్తాడు? శుక్లాతో ప్రేమాయణం ఏమవుతుంది? అనేది అసలు కథ. థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. థియేటర్లో రిలీజైన ఈ మూవీకి మంచి టాకే వచ్చింది. మరి.. ఓటీటీ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి.
Read Also: ‘పుష్ప‘ తర్వాత 5 లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసిన రష్మిక? ఆమె రియాక్షన్ ఏంటో తెలుసా?
Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ
Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?
Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు