Sudigali Sudheer: వాళ్ళను 'సుడిగాలి' సుధీర్ అన్ని మాటలు అన్నాడా?
టీవీలో 'సుడిగాలి' సుధీర్‌కు స్టార్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు హీరోగా సినిమాలు కూడా చేస్తున్నారు. బ్రదర్, ఫ్రెండ్స్ బర్త్ డే ఉందని వీడియో బైట్ అడిగితే... సుధీర్ చాలా మాటలు అన్నాడని తెలుస్తోంది.
స్టార్ హీరోలు, యాక్టర్లు కొన్నిసార్లు మొహమాటం కోసం తమకు తెలియని వాళ్లకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుంది. పరిచయస్తులు ఎవరో ఒకరు వచ్చి తమ తమ్ముడిదో, బంధువులదో, స్నేహితులతో పుట్టినరోజు అని, విషెస్ చెబుతూ వీడియో బైట్ అడిగితే ఇస్తుంటారు. 'జబర్దస్త్', 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమాలతో బుల్లితెరపై స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ మాత్రం ఎవరైనా అలా వీడియో బైట్ అడిగితే నిర్మొహమాటంగా 'నో' చెప్పేస్తాడట. ఆ విషయాన్ని స్కిట్‌లో కామెడీగా చూపించారు.
'ఓడలు బళ్ళు - బళ్ళు ఓడలు అయితే' కాన్సెప్ట్ టైపు తీసుకుని శుక్రవారం 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' షోలో స్కిట్స్ చేశారు. అందులో బాబు హీరో అయినట్టు... సర్వం కోల్పోయి 'సుడిగాలి' సుధీర్ అసిస్టెంట్ అయినట్టు స్కిట్ చేశారు. 'అరే నరేష్! నాకు హీరోగా అవకాశం వచ్చిందా... చేయమంటావా?' అని బాబు అంటే... 'వద్దురా! వీడిలా (సుధీర్ ను చూపిస్తూ) అయిపోతావ్' అని నరేష్ అంటాడు.
ఆ తర్వాత బాబును 'సార్... మా తమ్ముడి బర్త్ డే ఉంది. ఒక్క వీడియో బైట్ ఇవ్వండి సార్' అని సుధీర్ అడుగుతాడు. 'నేను ఇవ్వను రా' అని బాబు అంటాడు. 'ఎందుకు?' అని సుధీర్ ప్రశ్నిస్తే... 'ఈ రోజు నువ్వు అడిగావు. రేపు ఇంకొకడు అడుగుతాడు. మళ్లీ వాళ్లకు ఇవ్వకపోతే వాళ్లు ఫీలవుతారు' అని బాబు ఆన్సర్ ఇస్తాడు. 'ఇది ఎక్కడో విన్నట్టు ఉంది రా' అని పక్కన ఉన్న రామ్ ప్రసాద్‌తో అని సుధీర్ అంటే... 'విన్నటు కాదు రా! అన్నట్టే ఉంటుంది. ఏ రోజైనా నువ్వు బైట్ ఇచ్చావ్ రా? నువ్వు పెద్ద మహేష్ బాబు మరి... వీడియో బైట్ చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? నీ ఆస్తులు ఖరాబ్ అవుతాయా?' అని బాబు ఫైర్ అయ్యాడు.
స్కిట్‌లో కామెడీగా చూపించినా... బయట ఎవరైనా వీడియో బైట్ అడిగితే సుధీర్ అలాగే చేస్తాడని టీవీ ఇండస్ట్రీ గుసగుస. చాలా మాటలు అంటరాని టాక్. గతంలో తాము నటించిన ఓ సినిమా ప్లాప్ అయితే ఇలాగే సెటైర్స్ వేసుకున్నారు. సుధీర్, గెటప్ శీను, ఆటో రామ్ ప్రాసాద్ హీరోలుగా 'త్రీ మంకీస్' సినిమా చేశారు. అది ప్లాప్ అయిన కొన్ని రోజులకు దాని మీద కూడా స్కిట్ చేసి నవ్వించారు. సెల్ఫ్ సెటైర్స్ వేసుకోవడం వీళ్లకు అలవాటే అని టీవీ ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.