![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sudigali Sudheer New Show : ఆహా - సుడి లేదు గానీ 'సుడిగాలి' సుధీర్ ఉన్నాడు!
'సుడిగాలి' సుధీర్ కొత్త కామెడీ షోతో తెలుగు ప్రజల ముందుకు రానున్నాడు. అయితే, ఆ షోలో ఆయన కమెడియన్ కాదు... హోస్ట్! ఆ షో వివరాలు తెలుసుకోవాలా? లేట్ ఎందుకు? న్యూస్ చదవండి మరి!
![Sudigali Sudheer New Show : ఆహా - సుడి లేదు గానీ 'సుడిగాలి' సుధీర్ ఉన్నాడు! Sudigali Sudheer confirmed as host for AHA OTT stand up comedians show Comedy Stock Exchange Sudigali Sudheer New Show : ఆహా - సుడి లేదు గానీ 'సుడిగాలి' సుధీర్ ఉన్నాడు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/2126c240dbef0098871bae59d89d959b1668251988927313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) కు టీవీలో స్టార్ ఇమేజ్ ఉంది. యూట్యూబ్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్స్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకని, ఆయనకు టీవీ, ఓటీటీల్లో అవకాశాలు వస్తున్నాయి. 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు సుధీర్ టాటా బైబై చెప్పేసి... ఆ తర్వాత మాటీవీలో శింగింగ్ రియాలిటీ షో 'సూపర్ సింగర్ జూనియర్'కు అనసూయతో కలిసి హోస్ట్ చేశారు. ఆ షో కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఆయన ఓటీటీకి వస్తున్నారు.
ఆహా... సుధీర్!
'సుడిగాలి' సుధీర్‌ను ఓటీటీకి పరిచయం చేస్తోంది ఆహా తెలుగు. 'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' పేరుతో స్టాండప్ కామెడీ షో ఒకటి ప్లాన్ చేశారు. దానికి సుధీర్ హోస్ట్ చేయనున్నారు. ''కామెడీ స్టాక్ ఎక్సేంజ్ (Comedy Stock Exchange) లాంటి షోకి హోస్ట్ చేయాలంటే సుడి ఉండాలి... లేదంటే సుడిగాలి సుధీర్ అయ్యుండాలి'' అని ఆహా ఓటీటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలో ఈ షో స్టార్ట్ కానుందని పేర్కొంది.
View this post on Instagram
అనిల్ రావిపూడి కూడా!
'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్ 3' సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన కూడా 'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' షోతో ఓటీటీకి ఇంట్రడ్యూస్ కానున్నారు. 'అరే... స్టాక్స్ దమ్ము లేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిల్లిపోతుంది'' అని ఆయన కొన్ని రోజుల క్రితమే ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ నెలలో 'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' షో స్టార్ట్ కానుంది. త్వరలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అయ్యేది చెప్పనున్నారు. 'కామెడీ స్టాక్ ఎక్సేంజ్'లో చాలా ప్రత్యేకమైనదని, స్టేజీల మీద కామెడీ చేసి, ప్రేక్షకులకు తమవైన మాటలతో చక్కిలిగింతలు పెట్టి కడుపుబ్బ నవ్వించే వారికి ఈ షో ఇంపార్టెన్స్ ఇస్తుందని ఆహా వర్గాలు పేర్కొన్నాయి.
View this post on Instagram
'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' స్టాండప్ కామెడీ అని సమాచారం. వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ తదితరులు స్టాండప్ కామెడీ చేయడానికి రెడీ అవుతున్నారు. ''ట్యాలెంటెడ్ ఆర్టిస్టులతో కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ షోలో నేను కూడా భాగం అయినందుకు సంతోషంగా ఉంది'' అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
Also Read : ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా టైటిల్ అది కాదు!
'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) పేరు చెబితే తెలుగు బుల్లితెర వీక్షకులకు, ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'ఎక్స్ట్రా జబర్దస్త్' (Extra Jabardasth). డబ్బుల కోసం ఆ కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చి, వేరే ఛానల్‌కు వెళ్ళిన ఆయన... మళ్ళీ 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ఈ మధ్య చెప్పారు. లేటెస్ట్ ప్రోమో చూస్తే... ఈ షోలో మళ్ళీ ఆయన సందడి చేసినట్టు అర్థమైంది. అయితే... దాని వెనుక కథ వేరే ఉంది.
సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాలోడు' (Gaalodu Movie). ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రచారం కోసం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్లతో 'జబర్దస్త్' స్టేజి మీద సందడి చేశారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు సుధీర్ వచ్చింది సిఆ నిమా ప్రమోషన్ కోసమే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)