Sudeep Vs Ajay devgn: 'నేను కన్నడలో టైప్ చేసి ఉంటే మీ పరిస్థితి ఏంటి?' అజయ్ దేవగన్ కి సుదీప్ కౌంటర్
ట్విట్టర్ వేదికగా సుదీప్, అజయ్ దేవగన్ ల మధ్య వార్ నడిచింది.
కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇటీవల తన సినిమా ప్రెస్ మీట్ లో 'కేజీఎఫ్2' సక్సెస్ గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారని.. ఈ విషయంలో చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా అని చెప్పారు. ఇకపై హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తుందని.. తెలుగు, తమిళంలో డబ్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. కానీ అవి సక్సెస్ కావడం లేదని.. మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయని అన్నారు.
సుదీప్ చేసిన ఈ కామెంట్స్ పై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా సుదీప్ ను ట్యాగ్ చేస్తూ.. హిందీలో ఓ ట్వీట్ చేశారు. 'మై బ్రదర్.. నీ దృష్టిలో హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదనప్పుడు.. నువ్ మాతృభాషలో నటించే సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నావ్..? హిందీ ఎప్పటికీ మా మాతృభాష, అలానే రాష్ట్ర భాష కూడా. జన్ గన్ మన్' అంటూ రాసుకొచ్చారు.
ఇది చూసిన సుదీప్.. 'నేను చెప్పిన కాంటెక్స్ట్ కంప్లీట్ డిఫరెంట్.. అది మీ వరకు వేరే అర్ధం వచ్చేలా రీచ్ అయింది. ఎవరినైనా హర్ట్ చేయాలని కానీ.. వాదించాలని కానీ ఆ కామెంట్స్ చేయలేదు. నేను మిమ్మల్ని పెర్సనల్ గా కలిసినప్పుడు ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడానో వివరిస్తాను. మన దేశంలో ఉన్న అన్ని భాషలను నేను గౌరవిస్తాను' అని రాసుకొచ్చారు. అలానే అజయ్ దేవగన్ కి కౌంటర్ ఇస్తూ.. 'మీరు హిందీలో రాసిన ట్వీట్ ను నేను అర్ధం చేసుకోగలిగానంటే.. నేను హిందీ భాషను గౌరవిస్తాను, నేర్చుకున్నాను కాబట్టే. నో అఫెన్స్ సర్.. కానీ నేను కన్నడలో నా రెస్పాన్స్ ను టైప్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది..? మేమూ ఇండియాకు చెందిన వాళ్లమే కదా..?' అని రాసుకొచ్చారు.
కాసేపటి క్రితమే సుదీప్ రెస్పాన్స్ చూసి మళ్లీ ట్వీట్ వేశారు అజయ్ దేవగన్. ఈసారి ఏమన్నారంటే..? 'మీరు నా ఫ్రెండ్. తప్పుగా అర్ధం చేసుకున్నాను.. ఫిల్మ్ ఇండస్ట్రీని ఎప్పుడూ ఒకటే అని భావిస్తాను నేను. మనం అన్ని భాషలను గౌరవిస్తాం.. అలానే మిగిలిన వాళ్లు కూడా మనల్ని గౌరవించాలని ఆశిస్తాం. బహుసా.. ట్రాన్స్ లేషన్ అర్ధం చేసుకోవడంలో తప్పు జరిగింది ఉంటుంది' అని అన్నారు.
పూర్తి విషయం తెలియకుండా రియాక్ట్ అయితే ఇలానే జరుగుతుంటుందని.. ఈ విషయంలో మిమ్మల్ని బ్లేమ్ చేయడం లేదని.. క్రియేటివ్ రీజన్ కి సంబంధించి మీ నుంచి ట్వీట్ వచ్చి ఉంటే సంతోషంగా అనిపించి ఉండేదని సుదీప్ అన్నారు.
Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు
Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే
Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
And sir @ajaydevgn ,,
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi.
No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!!
Don't we too belong to India sir.
🥂
Translation & interpretations are perspectives sir. Tats the reason not reacting wothout knowing the complete matter,,,matters.:)
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
I don't blame you @ajaydevgn sir. Perhaps it would have been a happy moment if i had received a tweet from u for a creative reason.
Luv&Regards❤️ https://t.co/lRWfTYfFQi