By: ABP Desam | Updated at : 03 Feb 2022 08:49 AM (IST)
'హరిహర వీరమల్లు'లో పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో చారిత్రక చిత్రంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ ఓ అప్ డేట్ ఇచ్చారు.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో పవన్ కల్యాణ్ సార్ 'హరిహర వీరమల్లు' సినిమా నెక్స్ట్ యాక్షన్ షెడ్యూల్‌కు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయని శ్యామ్ కౌశల్ ఒక ట్వీట్ చేశారు. అందులో ఆయన, క్రిష్ ఉన్నారు. త్వరలో 'హరిహర వీరమల్లు' తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఓసారి ఈ షెడ్యూల్ కోసం క్రిష్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, చిత్ర సమర్పకులు ఏయం రత్నం తదితరులు నార్త్ ఇండియా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
Discussions on with brilliant director & a very nice human being @DirKrish for the next action schedule of HARI HARA VEERA MALLU with Pawan Kalyan Sir. Produced by Mr. A M Ratnam. May God bless our film & the team. 🙏🏻🙏🏻 pic.twitter.com/6msOv0onSx
— Sham kaushal (@shamkaushal09) February 2, 2022
పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!
Right To Dignity: సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !
Elon Musk: ఎలన్ మస్క్ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం