Naatu Naatu Song Oscar : దేవుడికి 'నాటు నాటు' నచ్చింది - రాజమౌళి కళ్ళల్లో మెరుపు చూశారా?
'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఆస్కార్! ఆ అవార్డు వేడుకకు ముందు 'ఆర్ఆర్ఆర్' సినిమా, రాజమౌళి అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ ఇది.
రాజమౌళిని (Rajamouli) తెలుగు ప్రేక్షకులు ముద్దుగా దర్శక ధీరుడు అని కీరిస్తూ ఉంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ఆయనకు పెట్టిన పేరు జక్కన్న. ప్రతి సన్నివేశాన్ని, సినిమాను శిల్పంలా చెక్కుతారని! ఆయన్ను దేవుడిగా కొలిచే సహాయ దర్శకులూ ఉన్నారు. తమకు రాజమౌళి స్ఫూర్తి అని చెబుతారు. అయితే... రాజమౌళి దర్శకుడిగా భావించే వ్యక్తి ఎవరో తెలుసా?
దేవుడిని కలిశా!
''నేను ఇప్పుడే దేవుడిని కలిశా'' అని సోషల్ మీడియాలో ఎస్.ఎస్. రాజమౌళి ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయనతో ఉన్నది ఎవరో తెలుసా? ఆయన కళ్ళల్లో మెరుపు ఎవరిని చూశాక వచ్చిందో తెలుసా? స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) ను.
View this post on Instagram
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన్ను చూసి స్ఫూర్తి పొందిన మన భారతీయ దర్శకులలో రాజమౌళి ఒకరు. ఆస్కార్ అవార్డులకు 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు...' పాట షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తర్వాత ఆస్కార్స్ కోసం రాజమౌళి, కీరవాణి అమెరికా వెళ్ళారు. అక్కడ స్టీవెన్, రాజమౌళి ఒకరినొకరు కలిశారు.
'నాటు నాటు...' నచ్చిందన్నారు!
ప్రముఖ సంగీత దర్శకుడు, రాజమౌళి సోదరుడు ఎం.ఎం. కీరవాణి (Keeravani) కూడా స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో దిగిన ఫోటోలు షేర్ చేశారు. తనకు 'డ్యూయెల్' సహా ఆయన తీసిన సినిమాలు ఇష్టమనే విషయాన్ని చెప్పానని తెలిపారు. 'నాటు నాటు...' పాట నచ్చిందని స్టీవెన్ స్పీల్‌బర్గ్ చెప్పడం నమ్మలేకపోతున్నాని కీరవాణి ట్వీట్ చేశారు.
Also Read : విలన్‌కు హీరోయిన్ ఛాన్స్ - బాలకృష్ణ ప్రామిస్
And I couldn’t believe it when he said he liked Naatu Naatu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏 pic.twitter.com/BhZux7rlUK
— mmkeeravaani (@mmkeeravaani) January 14, 2023
రాజమౌళి విజన్‌కు దక్కిన అవార్డు
'నాటు నాటు...' పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి... రాజమౌళి విజన్‌కు దక్కిన అవార్డుగా పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై తాను రాసిన పాటకు గుర్తింపు, గౌరవం దక్కడంతో గేయ రచయిత చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. 'నాటు నాటు...' పాడిన కీరవాణి తనయుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. వీరితో పాటు 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఉన్నారు. రెడ్ కార్పెట్ మీద 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read : అక్కినేని హీరోతో పూజా హెగ్డే - ఇందులో నిజమెంత?
దర్శకుడు ధీరుడు రాజమౌళి డ్రస్సింగ్ స్టైల్ ఇండియన్ ట్రెడిషన్ అంటే ఏమిటో వెస్ట్రన్ జనాలకు చూపించింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, రాజమౌళి సతీమణి రామ, కీరవాణి సతీమణి శ్రీవల్లి చీరకట్టులో హాజరయ్యారు. భారతీయ సంప్రదాయంలో చీరకు ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు... అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ద్వారా మన భారతీయతను అక్కడి ప్రేక్షకులకు చూపించిన ఘనత రాజమౌళి అండ్ 'ఆర్ఆర్ఆర్' యూనిట్ సభ్యులకు దక్కుతుందని చెప్పాలి. ఇది జక్కన్న మార్క్ అని చెప్పాలి.