By: ABP Desam | Updated at : 13 Jan 2023 02:27 PM (IST)
పూజా హెగ్డే (Image courtesy - @ Pooja Hegde /Instagram)
పూజా హెగ్డే (Pooja Hegde) కు తెలుగులో మాత్రమే కాదు... తమిళ, హిందీ భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. దక్షిణాది, ఉత్తరాది భాషల్లో అగ్ర హీరోల సరసన ఆమె సినిమాలు చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా తెలుగులోని ఓ అగ్ర హీరో సరసన ఆమె సినిమా చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో నిజం ఎంత? అసలు, ఆ వార్త ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
నాగార్జున కొత్త సినిమాలో...
రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ (Prasanna Kumar Bezawada) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'ధమాకా' నుంచి అంతకు ముందు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలకు ఆయన కథలు అందించారు. కొన్నాళ్ళుగా ప్రసన్న కుమార్ దర్శకుడిగా మారనున్నారని ప్రచారం జరుగుతోంది. తొలుత యువ హీరోల పేర్లు వినిపించాయి. అయితే, సీనియర్ స్టార్ హీరో నాగార్జున ఛాన్స్ ఇచ్చారు.
నాగార్జునతో పూజా హెగ్డే?
Pooja Hegde - Nagarjuna : నాగార్జున కథానాయకుడిగా ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం వహించనున్న సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించే ఛాన్స్ ఉందని రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత? అని ఆరా తీయగా... ''ఆ ప్రచారం నిజం కాదు'' అని పూజా సన్నిహిత వర్గాలు తెలిపాయి. అదీ సంగతి!
నాగార్జున కుమారులు ఇద్దరితో పూజా హెగ్డే సినిమాలు చేశారు. నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం', అఖిల్ జోడీగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో నటించారు. యువ హీరోల సరసన ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి. ఈ సమయంలో సీనియర్ హీరోల సరసన నటించే ఆలోచన ఉంటుందని అనుకోవడంలో అర్థం లేదు.
మహేష్ - త్రివిక్రమ్ సినిమా షురూ
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఆఫీసులో ఆమె ఫోటో దిగారు. SSMB 28 వర్క్ మొదలైందని పూజా హెగ్డే పేర్కొన్నారు.
హిందీలో సల్మాన్ సినిమా ఉందిగా
తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేస్తున్న పూజా హెగ్డే... హిందీలో సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లో ఆమె నటించారు. అందులో విక్టరీ వెంకటేష్ చెల్లెలుగా కనిపించనున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కాటమరాయుడు'కు రీమేక్ అది. రెండు మూడు హిందీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.
Also Read : పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?
పవన్ 'భగత్ సింగ్'లో పూజా ఉంటుందా?ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్ - పూజా హెగ్డే కాంబినేషన్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నారు కదా! అందులో పూజా హెగ్డే నటించే ఛాన్సులు ఉన్నాయట. హరీష్ శంకర్ లాస్ట్ రెండు సినిమాల్లో ఆమె నటించారు. వాళ్ళది హిట్ కాంబినేషన్. సో... కుదిరితే బావుంటుంది.
Also Read : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ : మెగాభిమానులకు పూనకాలు గ్యారెంటీనా? మెగాస్టార్ మాస్ మూవీ ఎలా ఉందంటే?
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం
Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?
Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు
Jangaon News: రసవత్తరంగా జనగామ రాజకీయాలు - అజ్ఞాతంలోకి 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు