News
News
X

Waltair Veerayya Review - 'వాల్తేరు వీరయ్య' రివ్యూ : మెగాభిమానులకు పూనకాలు గ్యారెంటీనా? మెగాస్టార్ మాస్ మూవీ ఎలా ఉందంటే?

Waltair Veerayya Review Telugu : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : వాల్తేరు వీరయ్య
రేటింగ్ : 2.75/5
నటీనటులు : చిరంజీవి, శ్రుతీ హాసన్, రవితేజ, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, 'వెన్నెల' కిశోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ప్రదీప్ రావత్ తదితరులతో పాటు ప్రత్యేక గీతంలో ఊర్వశి రౌతేలా
స్క్రీన్ ప్లే  : కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి
ఛాయాగ్రహణం : ఆర్థర్ ఎ విల్సన్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ 
కథ, మాటలు, దర్శకత్వం : బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) 
విడుదల తేదీ: జనవరి 13, 2022

పూనకాలు లోడింగ్... 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya Review)పై ముందు నుంచి దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli)ది ఒక్కటే మాట. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి అతను వీరాభిమాని. ప్రచార చిత్రాలతో వింటేజ్ చిరంజీవిని గుర్తు చేశారు. మరి, సినిమా ఎలా ఉంది? రవితేజ (Ravi Teja) పాత్ర ఎలా ఉంది? సంక్రాంతికి మెగాభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉందా? లేదా?

కథ (Waltair Veerayya Story) : వాల్తేరు వీరయ్య (చిరంజీవి) సముద్రానికి రాజు లాంటోడు. డ్రగ్ డీలర్లు కోస్టల్ గార్డులను కిడ్నాప్ చేస్తే... వాళ్ళను సేఫ్‌గా తీసుకు రావడానికి నేవీ అధికారులు సైతం అతని సాయం కోరతారు. వీరయ్య వీరత్వం తెలిసి... సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) కలుస్తాడు. మలేషియాలోని డ్రగ్ డీలర్ సోలొమాన్ సీజర్ (బాబీ సింహా)ను కిడ్నాప్ చేసి ఇండియాకు తీసుకు రావాలని, ఎంత డబ్బు అయినా ఇస్తానని ఆఫర్ చేస్తారు. డీల్ ఓకే చేసి మలేషియా వెళ్ళిన వీరయ్య... తాను వచ్చింది సోలొమాన్ సీజర్ కోసం కాదని, అతని అన్నయ్య కాలా అలియాస్ మైఖేల్ సీజర్ (ప్రకాష్ రాజ్) కోసమని చెబుతాడు. వీరయ్య, మైఖేల్ మధ్య గొడవ ఏంటి? మైఖేల్ కోసం మలేషియా వెళ్ళిన వీరయ్యకు అక్కడ పరిచయమైన అదితి (శ్రుతీ హాసన్) ఎవరు? అసలు, ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) ఏం అయ్యాడు? సవతి సోదరులైన వీరయ్య, విక్రమ్ సాగర్ మధ్య విరోధం ఏమిటి? జాలరిపేటకు, డ్రగ్ డీలర్లకు సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  

విశ్లేషణ : చిరంజీవి మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. రీ ఎంట్రీలో 'ఖైదీ నంబర్ 150' మినహాయిస్తే... ఆ జానర్‌లో మళ్ళీ చేయలేదు. లుంగీ కట్టి రంగు రంగుల చొక్కాలు వేయడంతో 'వాల్తేరు వీరయ్య'పై మెగాభిమానులు కొంచెం అంచనాలు పెట్టుకున్నారు. రవితేజ ఉండటం, ప్రచార చిత్రాలు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. మరి, అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? అనే విషయానికి వస్తే... 

మెగాస్టార్ ఇమేజ్ మీద దర్శకుడు బాబీ అతిగా ఆధారపడ్డాడు. తనలో అభిమాని చిరంజీవిని ఎలా చూడాలని కోరుకుంటున్నాడో... ఆ విధంగా ప్రజెంట్ చేసే సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. ఆ సన్నివేశాలను కలిపే విధంగా చిక్కటి కథ, కథనాలు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. 

చిరంజీవి ఇంట్రడక్షన్ బావుంది, రవితేజది కూడా! ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. పాటలు స్క్రీన్ మీద అందంగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ భలే కుదిరాయి. మ్యాడ్ మ్యాక్స్ టైపులో తీసిన ఫైట్ బావుంది. విడివిడిగా చూస్తే ప్రతిదీ బాగున్నట్టే ఉంటుంది. కథగా, సినిమాగా చూస్తే ఏదో వెలితి ఉంటుంది. చిరులో మంచి కామెడీ టైమింగ్ ఉంది. దానిని సరిగా వాడుకోలేదు. కథలో ఎమోషనల్ సీన్స్ వర్కవుట్ కాలేదు. సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పుడు... వాళ్ళిద్దరి మధ్య బ్లడ్ బాండింగ్ ఉన్నప్పుడు... ప్రేక్షకులు ఎంతో ఆశిస్తారు. అయితే... ఈ కథలో అంత స్కోప్ లేదు. చిరంజీవి, రవితేజ తమ నటనతో కొన్ని సన్నివేశాలను నిలబెట్టారు. స్క్రీన్ మీద వాళ్ళిద్దరూ కనిపించినప్పుడు కళ్ళ నిండుగా ఉంటుంది.

'వాల్తేరు వీరయ్య' కథకు వస్తే... గొప్ప కథేమీ కాదు. రెగ్యులర్ రోటిన్ కమర్షియల్ ఫార్ములా ఫిల్మ్. దానికి బ్రదర్ సెంటిమెంట్ యాడ్ చేశారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆశించిన రీతిలో లేదు. సాధారణంగా ఉన్నాయి. సినిమాలో ఎమోషన్ వర్కవుట్ కాకపోవడానికి ప్రధాన కారణం... రవితేజ, కేథరిన్ మధ్య బాండింగ్ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం! వాళ్ళిద్దరి బాండింగ్ చూపించి ఉంటే... ఆ తర్వాత చిరంజీవి, కేథరిన్ మధ్య సన్నివేశాల్లో బలం ఉండేది. హీరో లక్ష్యానికి, ఆశయానికి విలువ ఉండేది. హీరో చైల్డ్ హుడ్ ఎపిసోడ్‌లో కూడా బలం లేదు. 

దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్క్రీన్ మీద బావున్నాయి. అయితే, వాటికి సరైన ప్లేస్‌మెంట్‌ కుదరలేదు. ఇంటర్వెల్ తర్వాత చిరంజీవి, శ్రుతీ హాసన్ పాట కథకు అడ్డు తగిలింది. నేపథ్య సంగీతం బావుంది. ఇంటర్వెల్ ముందు ఫైట్, టైటిల్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ బావుంది. 

నటీనటులు ఎలా చేశారంటే? : వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా మెగాస్టార్ కొన్ని ఫైట్స్, డ్యాన్స్ చేశారు. ఆయనకు ఇటువంటి క్యారెక్టర్స్ కొత్త ఏమీ కాదు. ఈజీగా చేసుకుంటూ వెళ్ళారు. రవితేజ కూడా అంతే! ఆల్రెడీ పోలీస్ రోల్స్ చేసిన ఆయన... ఈసారి తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపించారు. హీరోలు ఇద్దరూ స్క్రీన్ మీద హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఆ విషయంలో బాబీ సక్సెస్ అయ్యాడు. జస్ట్ కమర్షియల్ హీరోయిన్ అన్నట్టు కాకుండా... శ్రుతీ హాసన్‌కు కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించింది. చిరంజీవితో సన్నివేశాలను కాస్త కన్వీన్సింగ్‌గా రాయడంతో పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. కానీ, ఆమె క్యారెక్టర్‌కు సరైన జస్టిఫికేషన్ లేదు. కేథరిన్ ఎమోషనల్ & ఇంపార్టెంట్ రోల్ చేశారు. బాబీ సింహా, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, 'వెన్నెల' కిషోర్, సత్యరాజ్ తదితర నటీనటులవి రెగ్యులర్ క్యారెక్టర్స్. సో... అందరూ తమకు అలవాటైన రీతిలో చేసుకుంటూ వెళ్ళారు.
      
Also Read : 'వీర సింహా రెడ్డి' రివ్యూ : బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం - ఫ్యాక్షన్ స్టోరీ, సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే? : సంక్రాంతి పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళడానికి ఎటువంటి కంప్లైంట్స్ లేని సినిమా 'వాల్తేరు వీరయ్య'. చిరంజీవి అభిమానులను దృష్టిలో పెట్టుకుని పాటలు, ఫైటులతో తెరకెక్కించిన కమర్షియల్ చిత్రమిది. రెగ్యులర్ రొటీన్ కథ అయినప్పటికీ... ఇంటర్వెల్ బ్యాంగ్ మెగాభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. చిరంజీవి, రవితేజ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 'వాల్తేరు వీరయ్య'లో వింటేజ్ మెగాస్టార్‌ను చూడొచ్చు. ఆయన అభిమానులకు హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. 

Also Read : 'తెగింపు' రివ్యూ : అజిత్ విలనా? హీరోనా? - తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా?

Published at : 13 Jan 2023 08:10 AM (IST) Tags: Ravi Teja ABPDesamReview Chiranjeevi Waltair Veerayya Waltair Veerayya Review Waltair Veerayya Rating

సంబంధిత కథనాలు

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

టాప్ స్టోరీస్

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !

Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు   !

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు