By: ABP Desam | Updated at : 01 Feb 2022 03:37 PM (IST)
కోలీవుడ్ హీరోకి షాకిచ్చిన రాజమౌళి..
కోలీవుడ్ లో టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు శివ కార్తికేయన్. ఇటీవల ఆయన నటించిన 'డాక్టర్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయగా.. ఇక్కడ మంచి సక్సెస్ అందుకుంది. ఓటీటీలో సైతం ఈ సినిమా సత్తా చాటుతోంది. సీరియస్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తో అలరించబోతున్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో 'డాన్' అనే సినిమాలో నటించారు.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలొచ్చాయి. పెద్ద ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్ కూడా ఇచ్చాయి. కానీ శివకార్తికేయన్ ఒప్పుకోలేదు.
ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని పట్టుబట్టాడు. ఆయనే నిర్మాత కావడంతో ఎక్కడా రాజీ పడలేదు. ఫైనల్ గా మార్చి 25న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు రాజమౌళి రూపంలో ఈ హీరోకి ఒక షాక్ తగిలింది. తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీని ప్రకటించారు. అది కూడా మార్చి 25న వస్తుండడంతో శివకార్తికేయన్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
రాజమౌళి సినిమా వస్తుందంటే.. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకుంటారు. ఇప్పుడు శివకార్తికేయన్ కూడా తన సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్' పాన్ ఇండియా సినిమా. కోలీవుడ్ లో కూడా భారీ ఎత్తున సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో పోటీపడే రిస్క్ శివకార్తికేయన్ చేయరు కాబట్టి సినిమా వాయిదా పడుతుందనే అనుకోవాలి!
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చెప్పులేసుకుని ప్రమోషన్స్కు వచ్చేది అందుకే!
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?
Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !