News
News
X

Sridevi Chiranjeevi: ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ - వాల్తేరు వీరయ్య కొత్త పాట వచ్చేసింది - బాస్ గ్రేస్ చూశారా?

వాల్తేరు వీరయ్య సినిమాలో రెండో పాట ‘శ్రీదేవి చిరంజీవి’ విడుదల అయింది.

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ ట్యూన్ ఆకట్టుకునే విధంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే ‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ అయింది. మొదట ఈ పాటపై కొంత నెగిటివిటీ వచ్చినా, ఇప్పుడు రిపీట్స్‌లో కూడా వింటున్నారు.

ఈ పాటను జస్ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. బాస్ పార్టీ తరహలోనే దీనికి కూడా లిరిక్స్‌ను దేవిశ్రీ ప్రసాద్‌నే అందించారు. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిరంజీవి సరసన శ్రుతి హాసన్, రవితేజ సరసన కేథరిన్ ట్రెసా జంటగా నటించారు.

ఈ పాటను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విజర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో చిత్రీకరించారని చిరంజీవి చెప్పారు. ఈ లోయలో లొకేషన్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయని, అక్కడి లోయ అందాలు చూసి తాను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానని అన్నారు.

ఆ ఆనందాన్ని ఆపుకోలేక తానే స్వయంగా అక్కడి లొకేషన్స్ లో కొన్ని వీడియోలను షూట్ చేసి షేర్ చేస్తున్నానని తెలిపారు. లొకేషన్స్ చూడటానికి చాలా అందంగా ఉన్నా.. అంతకుమించి చలి ఉందని అన్నారు. సాంగ్ ను షూట్ చేసే సమయంలో మైనస్ 8 డిగ్రీల చలిలో డాన్స్ చేశామని చెప్పారు.

షూటింగ్ లో స్టెప్స్ చేయడానికి కూడా చాలా కష్టమైందని అయినా ఫ్యాన్స్ ఆనందం కోసం గడ్డకట్టే చలిని కూడా తట్టుకొని డాన్స్ చేశానని అన్నారు మెగాస్టార్. ఈ పాట కోసం టీమ్ లో ప్రతీ ఒక్కరూ చాలా కష్టపడ్డారని, తమ కష్టానికి తగ్గట్టుగానే పాట చాలా బాగా వచ్చిందన్నారు. సినిమాలో ఈ పాట ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్నారు. మైత్రీ  మూవీ మేకర్స్ నిర్మాణంలో  తెరకెక్కిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Published at : 19 Dec 2022 04:50 PM (IST) Tags: Shruti Haasan Waltair veerayya Chiranjeevi Sridevi Chiranjeevi Lyrical Video Sridevi Chiranjeevi

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?