అన్వేషించండి
Advertisement
Bhaag Saale: 'ముద్దపప్పు ఆవకాయ్' నుంచి 'భాగ్ సాలే'కు...
శ్రీసింహ హీరోగా 'భాగ్ సాలే' సినిమా సోమవారం ప్రారంభమైంది. దీనికి ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. అతడు గతంలో నీహారిక కొణిదెల ప్రధాన పాత్రలో 'ముద్దపప్పు ఆవకాయ్' సిరీస్, 'సూర్యకాంతం' సినిమా తీసింది.
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి రెండో కుమారుడు... హీరో శ్రీ సింహ కొత్త సినిమా 'భాగ్ సాలే' సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. 'మత్తు వదలరా'తో హీరోగా పరిచయమైన శ్రీసింహ, ఆ తర్వాత 'తెల్లవారితే గురువారం' సినిమా చేశాడు. హీరోగా అతడికి మూడో సినిమా ఇది. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లికి కూడా ఇది మూడో ప్రాజెక్ట్. గతంలో నీహారిక కొణిదెల ప్రధాన పాత్రలో 'ముద్దపప్పు ఆవకాయ్' సిరీస్, 'సూర్యకాంతం' సినిమా తీశాడు. నిహారికా కొణిదెల, శ్రీ సింహ, ప్రణీత్ ఫ్రెండ్స్. 'ముద్దపప్పు ఆవకాయ్' నుండి 'భాగ్ సాలే' వరకూ స్నేహితులతో పని చేస్తున్నాడు ప్రణీత్.
'భాగ్ సాలే' ప్రారంభోత్సవానికి దర్శకుడు హరీష్ శంకర్ అతిథిగా హాజరయ్యారు. సినిమా సమర్పకులు, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా... హరీష్ శంకర్ క్లాప్ ఇచ్చారు. కుమారులు ఇద్దర్నీ కీరవాణి ఆశీర్వదించారు. బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ సంస్థలు 'భాగ్ సాలే' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యష్ రంగినేని, శింగనమల కళ్యాణ్ నిర్మాతలు. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
క్రైమ్ కామెడీ జానర్ లో 'భాగ్ సాలే' తెరకెక్కుతోంది. అతడి తొలి సినిమా 'మత్తు వదలరా' కూడా క్రైమ్ కామెడీ సినిమాయే. అందులో హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లో అక్రమంగా గంజాయి సాగుతున్న తీరును చూపించారు. మరి, ఈ సినిమా ఎటువంటి క్రైమ్ చూపించబోతున్నారో? ఈ సినిమాకు శ్రీసింహ అన్నయ్య, కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సింహ తొలి రెండు సినిమాలకు కూడా అతడే సంగీతం అందించాడు. ఈ సినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, 'వెన్నెల' కిషోర్, నందినీ రాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, 'వైవా' హర్ష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీజో సాహిత్యం అందిస్తున్నారు. సుందర్ రామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్
Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement