By: ABP Desam | Updated at : 26 Feb 2023 06:40 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Instagram
మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘ధమాకా’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. హీరోలతో సమానంగా డాన్స్ చేస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది. ఇప్పుడు ఈ అమ్మడుకి సంబంధించి ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ సరసన ఐటెం సాంగ్ లో ఆడి పాడనుందని టాక్ నడుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉందట. అందుకోసం చిత్ర బృందం శ్రీలీలని కాంటాక్ట్ అయ్యిందని తెలుస్తోంది. శ్రీలీల కూడా ఒకే చెప్పేసిందని టాక్. అయితే ఇప్పుడు అందరీ డౌట్ ఒక్కటే. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్ర పోషించబోతున్నారు. మరి దేవుడితో ఐటెం సాంగ్ ఏంటా అని అందరూ డౌట్ పడుతున్నారు. జీ స్టూడియోస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పవన్ మేనల్లుడితో కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది.
వినోదయ సీతమ్ సినిమా తమిళ వెర్షన్ లో సముద్రఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ సముద్రఖని పోషించిన దేవుడు క్యారెక్టర్ చేస్తున్నారు. తంబి రామయ్య పాత్రను సాయి ధరమ్ తేజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఇక ‘పెళ్లిసందD’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తన డాన్సింగ్ టాలెంట్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మహేష్, త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే ఒక కథానాయిక కాగా, మరో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. అటు రామ్, బోయపాటి సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఐటెం సాంగ్ లో నటిస్తే శ్రియ, కాజల్, తమన్నా, సమంత జాబితాలో చెరిపోయినట్టే. ఒక పక్క హీరోయిన్లగా రాణిస్తూనే ప్రత్యేక పాటల్లో నటిస్తూ ఉన్నారు ఈ ముద్దుగుమ్మలు.
Read Also: విడాకుల తర్వాత తొలిసారి సామ్ ఫోటో షేర్ చేసిన చైతన్య, సమంత మాత్రం?
Allu Arjun: టాలీవుడ్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ - మీ ప్రేమే కారణమంటూ ఫ్యాన్స్‌కు బన్నీ నోట్!
Amrita Rao - Salman Khan: సల్మాన్‌తో సినిమా ఛాన్స్, దారుణంగా మోసపోయిన ‘అతిథి’ హీరోయిన్ అమృత రావు
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్