అన్వేషించండి

NTR Producer Death : ఎన్టీఆర్ 'అడివి రాముడు' నిర్మాత సూర్యనారాయణ మృతి

సీనియర్ ఎన్టీఆర్ హీరోగా 'అడివి రాముడు' సినిమా నిర్మించిన ఇద్దరు నిర్మాతల్లో ఒకరైన సూర్యనారాయణ నేడు మృతి చెందారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ నేడు తుది శ్వాస విడిచారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ 'అడివి రాముడు' నిర్మాతలలో ఆయన ఒకరు.

మరణాన్ని ముందే ఊహించిన సూర్యనారాయణ!?
నిర్మాత సూర్యనారాయణ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. వయసు రీత్యా శరీరం ఆయనకు సహకరించలేదు. అందువల్ల, ఇంటి నుంచి బయటకు కదల్లేదు. వీల్ ఛైర్ కు పరిమితం అయ్యారు. ఆఖరికి మనవరాలి వెడ్డింగ్ రిసెప్షన్ కు సైతం హాజరు కాలేదు. కొన్ని నెలలు క్రితమే ఆయన తన మరణాన్ని ఊహించారని సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. మానసికంగా ప్రిపేర్ అయ్యారట. 

Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?

గతేడాది (2022) డిసెంబర్ నెలలో నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు, వల్లభనేని జనార్ధన్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ బాధను దిగమింగుతూ... కొత్త ఏడాదిలో అంతా బావుండాలని 2023లోకి టాలీవుడ్ అడుగుపెట్టింది. తొలి వారంలో ఓ మరణం చోటు చేసుకుంది. సీనియర్ సినిమా జర్నలిస్ట్, గేయ రచయిత పెద్దాడ మూర్తి (Peddada Murthy) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా జనవరి 3వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. 

పెద్దాడ మూర్తి స్వస్థలం భీముని పట్నం. ఆయన తండ్రి వీరభద్రరావు నుంచి వారసత్వం అందుకుని సాహిత్యం వైపు అడుగులు వేశారు. విశాఖపట్టణంలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో విలేకరిగా ప్రయాణం ప్రారంభించారు. తర్వాత పలు పత్రికల్లో పని చేశారు.

పెద్దాడను లిరిసిస్ట్ చేసిన తమ్మారెడ్డి!
సినిమా జర్నలిస్టుగా ఉన్న పెద్దాడ మూర్తిని చిత్ర పరిశ్రమకు గేయ రచయితగా పని చేసిన వ్యక్తి మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన తెరకెక్కించిన 'కూతురు' చిత్రంలో ఓ గీతాన్ని రాసే అవకాశం ఇచ్చారు. పలు సీరియళ్లకు కూడా పెద్దాడ మూర్తి పాటలు రాశారు. 

గుర్తింపు తెచ్చిన 'చందమామ', 'స్టాలిన్'
కాజల్ అగర్వాల్, నవదీప్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన 'చందమామ' సినిమా పెద్దాడ మూర్తికి ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమాలో 'బుగ్గే బంగారమా...' పాటను రాశారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'స్టాలిన్' సినిమాలో 'సిగ్గుతో ఛీ ఛీ...' పాటను మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన మాటలు, పాటలు అందించిన 'నాగలి' సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. హైదరాబాద్, రాజీవ్ నగర్ శ్మశాన వాటికలో బుధవారం పెద్దాడ మూర్తి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన సోదరుడు పీవీడీఎస్ ప్రకాష్ గత ఏడాది కాలం చేశారు. ఆయన కూడా రచయిత, లిరిసిస్ట్. వరుస మరణాలతో పెద్దాడ మూర్తి కుటుంబంలో విషాదంలో మునిగింది.  

Also Read : అఖిల్‌పై మనసు పారేసుకున్న పెళ్ళైన హీరోయిన్

డిసెంబర్ 29, 2022లో మరణించిన వల్లభనేని జనార్ధన్ విషయానికి వస్తే... ఆయన స్వస్థలం ఏలూరు సమీపంలోని పోతులూరు. విజయవాడ లయోలా కాలేజీలో చదివారు. సినిమాలపై ఆసక్తితో పరిశ్రమకు వచ్చారు. నటుడిగా, దర్శక నిర్మాతగా పలు చిత్రాలు చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత విజయ్ బాపినీడుకు ఆయన అల్లుడు. బాపినీడు మూడో కుమార్తె లళినీ చౌదరితో జనార్ధన్ వివాహం జరిగింది. జనార్ధన్, లళిని దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురిలో ఓ అమ్మాయి చిన్నతనంలో మరణించారు. మరో అమ్మాయి అభినయ ఫ్యాషన్ డిజైనర్. అబ్బాయి అవినాశ్ అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. నటుడు చలపతి రావు ప్రయాణం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ఎన్టీఆర్ మద్దతుతో నటుడిగా ఎదిగి, తర్వాత అందరితో సినిమాలు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget