By: ABP Desam | Updated at : 27 Nov 2022 03:38 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
స్క్విడ్ గేమ్లో ఓ యోంగ్ సు
గత సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఇందులో నంబర్ వన్ అనే వృద్ధుడి పాత్రను ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. ఈ పాత్రలో కనిపించిన ఓ యోంగ్-సుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. 78 ఏళ్ల వయసున్న ఓ యోంగ్-సు 2017లో ఒక మహిళను అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలు చేసిన బాధితురాలు 2021 డిసెంబర్‌లో యోంగ్-సుపై ఫిర్యాదు చేసింది. కానీ 2022 ఏప్రిల్‌లో ఈ కేసును కొట్టేశారు. అయితే బీబీసీ కథనం ప్రకారం అధికారులు "బాధితురాలి అభ్యర్థన మేరకు" మళ్లీ దర్యాప్తును తిరిగి ప్రారంభించారు.
"సరస్సు చుట్టూ దారిని చూపడానికి నేను ఆమె చేతిని మాత్రమే పట్టుకున్నాను." అని ఓ యోంగ్-సు తెలిపాడు. కొరియన్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్ JTBCతో మాట్లాడుతూ, "నేను ఆవిడకు క్షమాపణలు చెప్పాను. ఆవిడ దాని గురించి గొడవ చేయదని తెలిపింది. కానీ దానికి అర్థం నేను ఆరోపణలను అంగీకరించినట్లు కాదు." అన్నారు.
లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను రావడంతో ఓ యోంగ్-సు నటించిన ప్రభుత్వ వాణిజ్య ప్రకటనను ప్రసారం చేయడాన్ని ఆపివేయాలని సియోల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఓ యోంగ్-సు 50 సంవత్సరాలకు పైగా నటిస్తున్నారు. అయితే 'స్క్విడ్ గేమ్'లో అతని పాత్ర అతనికి ప్రపంచ ఖ్యాతిని, ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఈ పోటీలో పాల్గొనే అతి పెద్దవాడిగా ‘స్క్విడ్ గేమ్’లో కనిపించారు. దక్షిణ కొరియా టీవీ సిరీస్ 'చాక్లెట్'లో కూడా ఆయన కీలక పాత్రలో కనిపించారు.
K Viswanath Death: సెల్యూట్ టు మాస్టర్ - కళాతపస్వికి కమల్, బాలకృష్ణ, అనిల్ కపూర్ నివాళులు
K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం
K Vishwanath Top 10 Movies: విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే - గుండె బరువెక్కిస్తాయ్, మనసును హత్తుకుంటాయ్!
Janaki Kalaganaledu February 3rd: తల్లిదండ్రులకు అబద్ధం చెప్పిన అఖిల్, నిలదీసిన జెస్సి- జ్ఞానంబ ఇంట్లో మలయాళం ఎంట్రీ
K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!