RRR: మహేష్ తో చరణ్, ఎన్టీఆర్ ఇంటర్వ్యూ - క్యాన్సిల్ అయిందా?
రీసెంట్ గా యాంకర్ సుమ.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి మీమ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. ఇప్పటివరకు విడుదలైన 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్ వీడియోల్లో ఇది హైలైట్ అనే చెప్పాలి.

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. మార్చి 25న సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ బాగా కష్టపడుతోంది. జనవరిలో రిలీజ్ అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాలకు తిరిగి ప్రమోషన్స్ చేశారు.
కానీ అనూహ్యంగా సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మార్చి 25న రిలీజ్ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి వరుసగా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. గత వారం నుంచి ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. రెగ్యులర్ ప్రెస్ మీట్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ తో పాటు చిట్ చాట్ సెషన్స్ నిర్వహించారు. దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు కీరవాణి 'ఆర్ఆర్ఆర్' టీమ్ ని ఇంటర్వ్యూలు చేశారు.
ఇక రీసెంట్ గా యాంకర్ సుమ.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి మీమ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. ఇప్పటివరకు విడుదలైన 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్ వీడియోల్లో ఇది హైలైట్ అనే చెప్పాలి. అయితే ఈ ఇంటర్వ్యూలతో పాటు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట. మహేష్ బాబు స్వయంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేసే విధంగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ ప్లాన్ చేసింది.
వీరి ముగ్గురు మధ్య మంచి బాండింగ్ ఉంది. మహేష్, రామ్ చరణ్ కలిసి తమ ఫ్యామిలీలతో ట్రిప్స్ కి కూడా వెళ్తుంటారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఇంటర్వ్యూ వచ్చి ఉంటే ఓ రేంజ్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. నిజానికి రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనే చేస్తున్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ సెట్ చేయడం పెద్ద పనేమీ కాదు. కానీ ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ కి ముందు ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రిలీజ్ తరువాత ప్లాన్ చేసినా.. ప్రమోషన్స్ కి పనికొస్తుంది. మరేం చేస్తారో చూడాలి!
View this post on Instagram





















