అన్వేషించండి

samantha: స‌మంత ఫ్యాన్ గ‌ర్ల్ మూమెంట్.. మ‌మ్ముట్టితో ఫొటో దిగి మురిసిపోయిన బ్యూటీ

samantha: మ‌ళ‌యాల‌ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టితో ఫొటో దిగి.. తెగ మురిసిపోతోంది హీరోయిన్ స‌మంత‌. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Samantha Fan girl Moment With Mammootty: టాలీవుడ్ లెడీ సూప‌ర్ స్టార్ స‌మంతకు కోట్లాదిమంది ఫ్యాన్స్. సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్ గా ఉంటారు స‌మంత‌. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇక ఆమె ఫ్యాన్స్ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆమెతో ఒక్క ఫొటో దిగాల‌ని ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. కానీ, ఆమె మాత్రం త‌మ అభిమాన న‌టుడు, మ‌ళ‌యాల సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టితో ఫొటో దిగి ఫ్యాన్ గార్ల్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోల‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి తెగ మూరిసిపోతోంది స‌మంత‌. ఇప్పుడు ఆ ఫొటో వైర‌ల్ అవుతోంది. ఇద్ద‌రు క‌లిసి సినిమా ఏమైనా తీస్తున్నారా? అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. 

ఫొటో వైర‌ల్.. 

మ‌మ్ముట్టితో క‌లిసి స‌మంత దిగిన ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అది ఏదో ఒక సినిమా షూట్ లో తీసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. స‌మంత లైట్ గ్రీన్ డ్రెస్ లో మెరిసిపోతుండ‌గా.. మ‌మ్ముట్టి హాఫ్ వైట్ ష‌ర్ట్ లో క‌నిపించారు. ఇక అదే ఫొటో తో పాటు ఫాహ‌ద్ ఫైసిల్ తో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు స‌మంత‌. నా మ‌రో ఫేవ‌రెట్ అని ఆ ఫొటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు. దీంతో ఏదో కొత్త ప్రాజెక్ట్ తో స‌మంత వ‌స్తోంద‌ని అనుకుంటున్నారు ఆమె అభిమానులు. ఇక ఖుషి సినిమా త‌ర్వాత స‌మంత న‌టించిన సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. ఇక మ‌మ్ముట్టి విష‌యానికి వ‌స్తే ఆయ‌న వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న న‌టించిన 'బ్ర‌హ్మయుగం' సినిమా ల‌వ‌ర్స్ ని ఆక‌ట్టుకుంది. ఆయ‌న న‌టించిన 'కాథ‌ల్ ది కోర్', 'క‌న్నూరు స్క్వాడ్' సినిమాలు కూడా స‌క్సెస్ అయ్యాయి.   

ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏళ్లు.. 

ఇక ఎంతోమంది యువ‌త డ్రీమ్ గార్ల్, అభిమాన న‌టి స‌మంత. ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు అయ్యింది. 2010లో ఆమె 'ఏం మాయ చేశావే' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో స‌మంత‌, నాగ‌చైత‌న్య జంట‌గా న‌టించారు. ఆ సినిమాలో అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ గా నిలిచింది. స‌మంత క్యారెక్ట‌ర్, అందం, ఆమె చీర‌క‌ట్టుకి అప్ప‌ట్లో ఎంతోమంది కుర్ర‌కారు ఫ్యాన్స్ అయిపోయారు. ఆమె న‌టించిన జెస్సీ క్యారెక్ట‌ర్ కి ఇప్ప‌టీకీ యువ‌త‌లో క్రేజ్ ఉంది. అంతలా ఎక్కేసింది ఆ క్యారెక్ట‌ర్. ఆమె ఫిల్డ్ లోకి వ‌చ్చి 14 ఏళ్లు అవ్వ‌డంతో స‌మంత‌కి సోష‌ల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు చాలామంది. "అప్పుడే నువ్వు వ‌చ్చి 14 ఏళ్లు అవుతుందా?" అని కొంత‌మంది ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుంటే.. "నీ స‌క్సెస్ ఇలానే కొన‌సాగాలి" అంటూ విషెస్ చెప్తున్నారు ఇంకొంత‌మంది.  

పోడ్కాస్ట్.. 

ప్రస్తుతం ఎక్కువగా ఖాళీగా ఉంటూ తన ఆరోగ్యంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది స‌మంత‌. ఇటీవ‌లే మయాసైటిస్‌కు చికిత్స తీసుకున్న ఆమె.. కొన్నాళ్లు సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించింది. కానీ తాజాగా తను వర్క్‌ను మళ్లీ ప్రారంభించినట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ ఇచ్చింది సామ్. దాంతో పాటు ఒక హెల్త్ పోడ్కాస్ట్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. చెప్పినట్లే తన మొదటి హెల్త్ పోడ్కాస్ట్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఈ పోడ్కాస్ట్‌ను తను ప్రారంభించింది ఆరోగ్యపరమైన అవగాహన, సలహాలు ఇవ్వడం కోసమే అయినా ఇందులో తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి కూడా సామ్ ఏమైనా చెప్తుందేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: సినిమాటోగ్రాఫ‌ర్‌ను పెళ్లి చేసుకున్న 'కందిరీగ' హీరోయిన్, ఫొటోలు వైర‌ల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget