అన్వేషించండి

Mahaveerudu trailer: ‘ధైర్యమే జయం’ అంటూ ‘మహావీరుడు’ని ముందుకు నడిపిస్తున్న రవితేజ!

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మహావీరుడు’. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ అదేంటంటే?

తమిళ నటుడు శివ కార్తికేయన్ తాజా సినిమా ‘మహావీరుడు’. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. మడోన్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న జులై 14న విడుదలకు రెడీ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఇ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.  

‘మహావీరుడు’కి రవితేజ వాయిస్

పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘మహావీరుడు’ రూపొందుతోంది.  ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ సరికొత్త విషయాలను పంచుకుంటూ మూవీపై అంచనాలు పెంచేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్ మహరాజా రవితేజ ‘మహవీరుడు’కి అండగా నిలిచినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ వాయిస్ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రమోషనల్ వీడియోను ఆవిష్కరించారు. “ధైర్యమే జయం” అంటూ గర్జించేలా రవితేజ వాయిస్ ఇచ్చారు. ఆయన ఎనర్జిటిక్ వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు.       

రవితేజకు కృతజ్ఞతలు చెప్పిన శివ కార్తికేయన్

వాస్తవానికి ఒక హీరో సినిమాకు మరొక హీరో వాయిస్ చెప్పడం చాలా సార్లు జరిగింది. మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం కొన్ని చిత్రాలకు వాయిస్ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం శివ కార్తికేయన్ సినిమాకు రవితేజ వాయిస్ ఇస్తున్నారు. ఇక తన సినిమాలో అద్భుతమైన వాయిస్ ఇచ్చిన రవితేజకు శివ కార్తికేయన్ కు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ".. రవితేజ సార్, మా సినిమాలో మీ ఎనర్జిటిక్ వాయిస్ ని అందించడం చాలా ఆనందంగా ఉంది. ‘మహావీరుడు’ టీమ్ కు మీరు సపోర్టుగా నిలిచినందుకు చాలా ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి తెలుగులో రవితేజ లాంటి హీరోతో ‘మహావీరుడు’కి  పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. తెలుగుతో పాటు అటు తమిళంలోనూ ఇదే పంథా కొనసాగిస్తోంది. ఇక్కడ రవితేజ వాయిస్ ఇవ్వగా, తమిళ వెర్షన్ లో విజయ్‌ సేతుపతి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.   

. @RaviTeja_offl Sir It’s a great pleasure to have your energetic voice in our film and thank you so much for your support to the #Mahaveerudu team sir 🙏🤗👍
- Sivakarthikeyan #MahaveeruduFromJuly14th #DhairiyameJeyam pic.twitter.com/682YdgVe7B

— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 11, 2023 />

‘మహావీరుడు’ సినిమాకు భరత్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండగా, విధు అయ్యన్న సినిమాటోగ్రఫీని అందించారు. ఫిలోమిన్ రాజ్ చిత్రానికి ఎడిటర్ గా పనిచేశారు.  శివకార్తికేయన్, అదితి శంర్ తో పాటు ఈ చిత్రంలో యోగి బాబు, సహా పలువురు నటించారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

Read Also: రియల్ లైఫ్ లో జరిగిన కథే ఈ సినిమా- ‘బేబీ’పై హీరోయిన్ వైష్ణవీ చైతన్య

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget