News
News
X

Mangli: ఆ వార్తలన్నీ అబద్ధం - నా ప్రతిష్ట కించపరడానికే - క్లారిటీ ఇచ్చిన మంగ్లీ!

ప్రముఖ గాయని మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగిందని వచ్చిన వార్తలను ఖండించారు.

FOLLOW US: 
Share:

ప్రముఖ గాయని మంగ్లీ కారుపై శనివారం రాత్రి రాళ్ల దాడి జరిగిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మంగ్లీ ఈ వార్తలను ఖండించారు. తనపై ఎటువంటి దాడి జరగలేదని, అది తప్పుడు ప్రచారం అని అన్నారు. తన ప్రతిష్టను కించపరచటానికి ఇదంతా చేస్తున్నారని తెలిపారు.

‘శనివారం రాత్రి బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఫోటోలు, వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది. అలాగే ఇది ఉత్తమ ఈవెంట్‌లలో ఒకటి. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ, మద్దతు అపారమైనది. ఈవెంట్ లో  నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఇది మాటలలో వర్ణించలేనిది .ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.’ అని తన సోషల్ మీడియా ఖాతాల్లో మంగ్లీ పోస్ట్ చేశారు.

బళ్లారి మున్సిపల్​ కళాశాల మైదానంలో శనివారం బళ్లారి ఫెస్టివల్​ ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో సింగర్ మంగ్లీ, మరికొంతమంది గాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ మంగ్లీ స్టేజీ మీద పాటలు కూడా పాడింది. మంగ్లీ తిరిగి వెళ్లేటప్పుడు తనను చూసేందుకు స్థానిక యువకులు ఎగబడ్డారని, మంగ్లీ వేదిక వెనుక ఉన్న మేకప్ టెంట్ లోపలికి వెళ్లినప్పుడు అందులోకి కూడా ప్రవేశించారని, దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేశారని వార్తలు వచ్చాయి. అలాగే మంగ్లీ తిరిగి వెళ్లిపోయేటప్పుడు కొంత మంది స్థానిక యువకులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారని కూడా వినిపించింది. కానీ మంగ్లీ ఈ వార్తలన్నిటినీ ఖండించారు.

అంతకు ముందు కొన్ని రోజుల క్రితం చిక్ బళ్లాపూర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా గాయని మంగ్లీ పాల్గొంది. ఆ కార్యక్రమంలో మంగ్లీని యాంకర్‌గా ఉన్న అనుశ్రీ వేదిక మీదకు పిలిచింది. వేదిక పైకి చేరుకున్న అనంతరం మంగ్లీ ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో మాట్లాడటం ప్రారంభించింది. ‘ఈ కార్యక్రమంలో కన్నడ వారు కూడా ఉన్నారు. కొంచెం కన్నడంలో మాట్లాడండి’ అని యాంకర్ అనుశ్రీ చెప్పగా, ‘పక్కనే అనంతపురం కూడా ఉంది. ఇక్కడ అందరికీ తెలుగు అర్థం అవుతుంది.’ అని మంగ్లీ సమాధానమిచ్చింది. అయితే అనుశ్రీ బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడింది.

అలాగే యాంకర్ అనుశ్రీ కన్నడలో ప్రశ్న అడిగేటప్పుడు కూడా తనకు అర్థం కావడం లేదని మంగ్లీ చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్ర వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. రాబర్ట్  సినిమా ద్వారా కన్నడ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది మంగ్లీ. జోగి ప్రేమ్ దర్శకత్వంలో  వచ్చిన ‘ఏక్ లవ్ యా’  చిత్రం తర్వాత కన్నడలో వరుసగా పాటలు పాడే అవకాశాలు కూడా వస్తున్నాయి . పుష్ప  సినిమాలో ‘ఊ అంటావా మామ’ పాట కన్నడ వెర్షన్‌ను మంగ్లీనే పాడింది.

View this post on Instagram
 
A post shared by Mangli Singer (@iammangli)

Published at : 23 Jan 2023 09:37 AM (IST) Tags: mangli mangli latest news mangli updates mangli stone pelting Mangli Bellary Event

సంబంధిత కథనాలు

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే  'నిజం విత్ స్మిత' మొదలు

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?