అన్వేషించండి

Geetha Madhuri: గుడ్ న్యూస్ షేర్ చేసిన గీతా మాధురి, అసలు విషయం చెప్పేసిందిగా!

Geetha Madhuri: సింగర్ గీతా మాధురి సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పింది. అసలు విషయాన్ని నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్ గా వెల్లడించింది.

Geetha Madhuri: సింగర్ గీతా మాధురి తన అభిమానులతో సంతోషకరమైన వార్తను పంచుకుంది. మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో భర్త నందు, కూతురు దాక్షాయనితో పాటు గీత కనిపించింది. ఈ పిక్ క్యాప్షన్ లో అసలు విషయాన్ని వెల్లడించింది. దాక్షాయని త్వరలో అక్క కాబోతున్నట్లు రాసుకొచ్చింది. మరోసారి తాను ప్రెగ్నెంట్ అయినట్లు ఇండైరెక్ట్ గా చెప్పింది. వచ్చే ఏడాది (2024) ఫిబ్రవరిలో తను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు, సినీ అభిమానులు గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.    

2014లో పెళ్లి, 2019లో పాప

గీతా మాధురి, నందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, 2014లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ దంపతులకు సుమారు 5 సంవత్సరాల తర్వాత, అంటే 2019 అమ్మాయి పుట్టింది. ఆమెకు దాక్షాయని ప్రకృతి అనే పేరు పెట్టారు. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది గీతా మాధురి.

ఇండస్ట్రీలో రాణిస్తున్న గీత, నందు

గీతా మాధురి తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్‌గా రాణిస్తోంది. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గానూ చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అద్భుత గాత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పలు సినిమాల్లో పాడిన పాటలకు గాను బెస్ట్‌ సింగర్‌ గా అవార్డులను అందుకుంది. కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. గీతా మాధురి భర్త నందు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. గత కొద్ది కాలంగా యాంకర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా కనిపిస్తున్నారు. మరోవైపు పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. మొత్తంగా భార్యాభర్తలు సినీ ఇండస్ట్రీలో తమ ప్రతిభ చాటుకుంటున్నారు.

గీత మాధురి, నందు విడిపోతున్నారంటూ ఊహాగానాలు

ఇక కొద్ది రోజుల క్రితం గీతా మాధురి, నందు దంపతుల గురించి పలు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు విడిపోతున్నారంటూ కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాశాయి. అయితే, ఈ వార్తలు వాస్తవం కాదని గీతా మాధురి వెల్లడించింది. అవన్నీ పుకార్లు మాత్రమేనని తేల్చి చెప్పింది. ఇలాంటి వార్తలు చూసి నవ్వు వస్తున్నట్లు నందు వెల్లడించాడు. అయితే, కొన్నిసార్లు బాధ కూడా కలుగుతుందని చెప్పుకొచ్చాడు. అటు రెండో బిడ్డ రాబోతున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri)

Read Also: మోడీకి వెంకీ మామ టిప్స్ - ‘సైంధవ్’ లిరికల్ సాంగ్ అదుర్స్

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
Embed widget