News
News
X

Shiva Rajkumar Ghost Movie : కన్నడలో మరో పాన్ ఇండియా సినిమా - ఒక్క సెట్‌కు ఆరు కోట్లు

కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా వస్తోంది. శివ రాజ్ కుమార్ నటిస్తున్న సినిమా కోసం ఆరు కోట్ల ఖరీదైన సెట్ వేశారు.

FOLLOW US: 
 
బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు చేసే సత్తా కన్నడ సినిమాకు ఉందని, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు కన్నడ చిత్రసీమకు ఉందని 'కెజియఫ్', 'కెజియఫ్ 2', 'విక్రాంత్ రోణ', 'కాంతార' చిత్రాలు ప్రూవ్ చేశాయి. దాంతో కన్నడలో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం ఎక్కువ అయ్యింది. కన్నడ అగ్ర కథానాయకులు ఇతర భాషల ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.  

కరుణడ చక్రవర్తి డాక్టర్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్' (Ghost Movie). బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆరు కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన జైల్ సెట్‌లో ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు.

దీపావళి సందర్భంగా 'ఘోస్ట్' సినిమాలో శివ రాజ్ కుమార్ ఇంటెన్స్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శక - నిర్మాతలు తెలిపారు. చేతిలో గన్, చుట్టూ బుల్లెట్స్ వర్షం, మధ్యలో శివ రాజ్ కుమార్... దీపావళి పోస్టర్ ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది.  

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో శివ రాజ్ కుమార్ అతిథిగా కనిపించారు. శతకర్ణుడి కథను వివరించే పాత్రను ఆయన పోషించారు. రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా చేశారు. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఈ 'ఘోస్ట్' సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టారు. 'కెజియఫ్', 'కాంతార' విజయాలు, ఆ చిత్రాలకు ఇతర భాషల్లో వచ్చిన వసూళ్లు మిగతా కన్నడ హీరోలకు ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతో పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు.

News Reels

Shiva Rajkumar's Ghost Movie Shooting Update : ''ప్రస్తుతం జైల్ సెట్‌లో చిత్రీకరణ చేస్తున్నాం. అందులో  24 రోజుల పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్లాన్ చేశాం. నవంబర్ 10వ తేదీకి మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. డిసెంబర్‌లో రెండో షెడ్యుల్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది'' అని 'ఘోస్ట్' చిత్ర బృందం తెలిపింది.

Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by DrShivaRajkumar (@nimmashivarajkumar)

కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'ఘోస్ట్' సినిమాను భారీ  ఎత్తున విడుదల చేసే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి కన్నడ హిట్ సినిమా 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మస్తీ, ప్రసన్న విఎం మాటలు రాస్తున్నారు. 'కెజియఫ్' ఫేమ్ శివ కుమార్  కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. మహేంద్ర సింహ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Published at : 25 Oct 2022 09:15 AM (IST) Tags: Ghost Movie Shiva Rajkumar Shiva Rajkumar Ghost 6cr Set For Ghost Kannada Movie Updates

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

NBK Unstoppable 2 : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'లో జయ జయ?

NBK Unstoppable 2 : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'లో జయ జయ?

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

NRI Hospital ED  : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !