అన్వేషించండి

Shehnaaz Gill: సల్మాన్ ఖాన్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’ నటి - ఎందుకంటే..

'కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌'లో నటించిన ఓ నటి.. సల్మాన్ ఖాన్ ఫోన్ కాల్‌ను బ్లాక్ చేసిందట. తాజాగా ఆమె ఆ విషయాన్ని చెప్పింది. కారణం ఏమిటో తెలుసా?

Shehnaaz Gill : 'బిగ్ బాస్ 13'లో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి నటి షెహనాజ్, బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో మంచి రిలేషన్ ను కొనసాగిస్తున్నారు. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌'లో ఆమెకు అవకాశం ఎలా వచ్చిందన్న విషయాన్ని రీసెంట్ గా వెల్లడించింది. ఈ సినిమా ఆఫర్ కోసం సల్మాన్  ఖాన్ తనకు కాల్ చేసినపుడు అతని నంబర్ ను బ్లాక్ చేశానంటూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. 

పరిచయం అంతగా అక్కర్లేని బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్. తన అందం, అభినయంతో అభిమానుల్ని కట్టిపడేస్తూ.. నటనతో ఆకర్షించడం ఆమె ప్లస్ పాయింట్స్. మోడల్ గా  కెరీర్ ప్రారంభించిన షెహనాజ్..  పలు మ్యూజిక్ వీడియోస్ టెలివిజన్ షోస్ లో పాల్గొని ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పంజాబీకి చెందిన అనేక చిత్రాల్లోనూ నటించింది. అంతే కాదు అత్యంత పాపులర్ అయిన ప్రముఖ రియాల్టీ షో హిందీ 'బిగ్ బాస్ షో'లో పాల్గొనడంతో ఆమెకు మరింత క్రేజ్ ను, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తీసుకొచ్చింది. ఈ షోలో ఆమె దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లాతో కలిసి ఎఫైర్ నడపడంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఫుల్ హాట్ టాపిక్ గా మారింది.

మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న షెహజాన్ గిల్ కు చాలా రోజుల తర్వాత మంచి రోజులు కలిసి వచ్చాయి. సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌' సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనుండడం విశేషం. అయితే ఇంత మంచి అవకాశం రావడానికి ముందు తెర వెనుక జరిగిన విషయాలను ఆమె ఇటీవల జరిగిన ది కపిల్ శర్మ షో లో పంచుకుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా షోకు వెళ్లిన చిత్ర బృందం.. అందర్నీ అలరిస్తూ, సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే షెహజాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌' మూవీలో ఎలా అవకాశం వచ్చిందన్న విషయాన్ని పంచుకున్నారు. ఈ మూవీ కోసం తనతో మాట్లాడేందుకు సల్మాన్ ఖాన్ ఫోన్ చేస్తే తాను అతని నంబర్ బ్లాక్ చేశానంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు.

గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు టైం కుదుర్చుకుని మాట్లాడడమంటే మామూలు విషయం కాదు. అలాంటిది అతనే కాల్ చేస్తే ఎవరైనా నంబర్ బ్లాక్ చేస్తారా? కానీ షెహజాన్ అలాంటి పనే చేసింది. ఇంతకీ సల్మాన్ నంబర్ ను ఆమె ఎందుకు బ్లాక్ చేసింది అన్న విషయానికొస్తే.. తాను అమృత్‌సర్‌లో గురుద్వారాను సందర్శించడానికి వెళ్లినపుడు తనకు ఓ తెలియని నంబర్ నుండి కాల్ వచ్చిందని షెహజాన్ చెప్పుకొచ్చింది. తనకు తెలియని నంబర్‌లను బ్లాక్ చేసే అలవాటు ఉందన్న ఆమె.. ఆ నంబర్ ఎవరిదో తెలుసుకోకుండా బ్లాక్ లో పెట్టానని వెల్లడించింది.  సల్మాన్ సార్ తనకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఓ మెసేజ్ రావడంతో...  తాను ట్రూకాలర్ యాప్‌లో నంబర్‌ను సెర్చ్ చేయగా తనకు కాల్ చేస్తున్నది సల్మాన్ ఖాన్ అని గుర్తించానని షెహనాజ్ చెప్పింది. దీంతో  వెంటనే ఆ నంబర్ ను అన్‌బ్లాక్ చేసి తిరిగి కాల్ చేశానని,  అప్పుడే సల్మాన్ సర్ తనకు సినిమా ఆఫర్ చేశాడని, అలా తనకు ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చిందని ఆమె స్పష్టం చేసింది.

ఇక 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌'  ట్రైలర్ లాంచ్‌లో షెహనాజ్ గిల్ మూవీలో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చారు. తనపై నమ్మకం ఉంచినందుకు సల్మాన్ ఖాన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. “నేను మొదటి సారి మ్యూజిక్ వీడియో షూటింగ్‌కి వెళ్లినప్పుడు, నన్ను రిజెక్ట్ చేశారు. 'యే మాకు ఆమెతో షూట్ చేయడం ఇష్టం లేదు. ఆమెను వెళ్లి పోమని చెప్పండి' అని ఎక్స్ పీరియన్స్ ను చెప్తూ షెహనాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను ఇంటికి తిరిగి వచ్చి చాలా ఏడ్చానన్నారు. తాను అలా ఏడుస్తున్నపుడు..  ఏదో ఒక రోజు సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తావని తన అమ్మ చెప్పిందని, చెప్పినట్టుగానే సార్ తనకు ఒక అవకాశం ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసింది. అప్పుడు అమ్మ అన్న మాటలు ఎప్పుడూ నిజమవుతాయని సల్మన్ నిరూపించారంటూ ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇటీవల జరిగిన ఈ 'ది కపిల్ శర్మ షో'లో సల్మాన్ ఖాన్, షెహనాజ్‌లతో కలిసి పూజా హెగ్డే, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, పాలక్ తివారీ, జాస్సీ గిల్, సిద్ధార్థ్ నిగమ్, వినాలి భట్నాగర్, సుఖ్‌బీర్ వంటి ఇతర మూవీ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Read Also: సల్మాన్‌తో డేటింగ్ రూమర్స్ పై పూజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget