Shanmukh Jaswanth: 'మా బ్రేకప్ కు కారణం సిరి కాదు' అసలు విషయం చెప్పిన షణ్ముఖ్
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు షణ్ముఖ్. దానికి కారణం దీప్తి సునయనతో అతడికి బ్రేకప్ జరగడమే.
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షణ్ముఖ్ ఫైనల్స్ వరకు చేరుకొని రన్నరప్ గా నిలిచాడు. మిగిలిన హౌస్ మేట్స్ తో పోలిస్తే బిగ్ బాస్ షో షణ్ముఖ్ బాగా ఇంపాక్ట్ చూపించింది. హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు షణ్ముఖ్. దానికి కారణం దీప్తి సునయనతో అతడికి బ్రేకప్ జరగడమే. ఎప్పుడైతే దీప్తి తమ బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిందో.. అప్పటినుంచి వీరికి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కొన్ని రోజుల పాటు తన ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ లు పెట్టిన దీప్తి.. ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయింది. మరోపక్క షణ్ముఖ్ ఇన్‌స్టాలో బ్రేకప్ ఎమోజీలు, పోస్ట్ లు పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాడు. వీరిద్దరి బ్రేకప్ కి సిరినే కారణమంటూ నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఈ విషయంలో సిరి చాలా హర్ట్ అయింది. అయితే తాజాగా షణ్ముఖ్ ఓ ఇంటర్వ్యూలో తమ బ్రేకప్ కి సిరి కారణం కాదని.. మరో రీజన్ ఉందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన షణ్ముఖ్.. దీప్తితో బ్రేకప్ కి సిరి కారణం కాదని.. నిజం చెప్పాలంటే సిరి, దీప్తి ఎప్పటికీ మంచి స్నేహితులే అని అన్నాడు. తన వల్ల దీప్తి చాలా నెగెటివిటీను ఎదుర్కొందని.. నెటిజన్లు తనను ట్రోల్ చేస్తున్నప్పుడు దీప్తి ఎంతో సపోర్ట్ చేసిందని.. సిరితో చనువుగా ఉండడం నెటిజన్లతో పాటు దీప్తి ఫ్యామిలీకి కూడా నచ్చలేదని చెప్పుకొచ్చాడు. దీని వలన దీప్తికి తన కుటుంబం నుంచో ఒత్తిడి పెరిగిందని.. ఇకనైనా తను సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందని అన్నాడు.
ఇప్పుడు ఇద్దరం కెరీర్ పై దృష్టి పెట్టామని.. మళ్లీ కలుస్తామా..? లేదా..? అనేది దేవుడి చేతుల్లో ఉందని.. మా జీవితాల్లో ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందని వేదాంతం మాట్లాడాడు. తన బ్రేకప్ విషయంలో సిరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో తనపై వస్తోన్న నెగెటివిటీ గురించి మాట్లాడాడు. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడానికే బిగ్ బాస్ హౌస్ కు వచ్చినట్లు.. కానీ తనలాంటి మూడీ పెర్సన్ కి బిగ్ బాస్ షో కరెక్ట్ కాదని అన్నాడు.
ఇతరులతో తక్కువగా మాట్లాడతానని.. జనాలు తన గురించి పాజిటివ్ గా ఆలోచిస్తారనుకుంటే, షో నుంచి బయటకొచ్చాక ఎంత నెగెటివిటీ వచ్చిందో అర్థమైందని చెప్పుకొచ్చాడు. 27 ఏళ్ల వయసులోనే ఎన్నో ఎదురుదెబ్బలు చూశానని.. వీటివల్ల ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలనేది నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
View this post on Instagram