By: ABP Desam | Updated at : 05 Feb 2022 01:28 PM (IST)
మెగాహీరో కోసం పాట పాడిన శంకర్ కూతురు
సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఇద్దరు కూతుళ్లు. రీసెంట్ గా పెద్దమ్మాయి ఐశ్వర్యకు వివాహం చేశారు. ఇక రెండో కూతురు అదితి శంకర్ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కార్తి హీరోగా తమిళంలో 'విరుమన్' అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నటిగా మారకముందే సింగర్ గా ప్రేక్షకులను అలరించబోతుంది.
వరుణ్ తేజ్ హీరోగా 'గని' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ లో కనిపించనుంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర లాంటి సీనియర్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా అదితి శంకర్ పాట పాడింది.
ఈ సినిమాలో 'రోమియో జూలియట్' అనే పాటను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ పాటను అదితి పాడినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి శంకర్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. తమన్ ని నటుడిగా పరిచయం చేసింది కూడా శంకరే. ఇప్పుడు శంకర్ డైరెక్టర్ చేస్తోన్న 'RC15'కి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'గని' సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అదితి శంకర్ ని టాలీవుడ్ కి సింగర్ గా పరిచయం చేయబోతున్నారు తమన్. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి వాయనం, రుక్మిణి ఫోన్ ట్యాప్ చేసిన మాధవ
Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక
Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం
Gudipoodi Srihari Is No More: సినీ విశ్లేషకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు
Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు