News
News
వీడియోలు ఆటలు
X

Shah Rukh Khan: ‘లుంగీ డ్యాన్స్’ షారుఖ్ ఖాన్‌కి నచ్చలేదట, చివరికి...

షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలో లుంగీ డ్యాన్స్ దేశాన్ని ఓ ఊపు ఊపింది. అయితే, తొలుత ఈ పాట షారుఖ్ కు నచ్చలేదు. చివరకు ఎలా ఒప్పుకున్నారో తాజాగా వెల్లడించారు హనీ సింగ్.

FOLLOW US: 
Share:

హనీ సింగ్, భారతీయ సినీ సంగీత అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన రూపొందించిన ఎన్నో పాటలు చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరినీ ఓ ఊపు ఊపాయి. తాజాగా ఆయన షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లోని లుంగీ డ్యాన్స్ పాట గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

లుంగీ డ్యాన్స్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన హనీ సింగ్

షారుఖ్ ఖాన్,  దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్‌’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలోని లుంగీ డ్యాన్స్ అనే పాటకు హనీ సింగ్ షారుఖ్‌ తో కలిసి పనిచేశారు. ఈ పాట అప్పట్లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. అన్ని వయసుల వారిని ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన పాటల లిస్టులో ఈ పాట తప్పకుండా ఉంటుంది. అంతేకాదు, చాలా వేడుకల్లో ఇప్పటికీ ఈ పాటను ప్లే చేస్తారు. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనీ సింగ్ ఈ పాట గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  

షారుఖ్ భాయ్ కి లుంగీ డ్యాన్స్ పాట నచ్చలేదు- హనీ సింగ్

“వాస్తవానికి నాకు బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే బాలీవుడ్ కు మ్యూజిక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒకరకంగా ఇబ్బంది పడ్డాను. ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్’ సినిమా కోసం ఒక పాట చేయడానికి షారూఖ్ భాయ్ నన్ను పిలిచారు. అతడు 'అంగ్రేజీ బీట్' లాంటిది చేయమని చెప్పాడు. ఎందుకలా అని అడిగాను.  ఆ పాట చాలా పెద్ద హిట్ కావడంతో అలాంటివి చేయనని చెప్తున్నానని అన్నాను. నేను అలాంటి పాటను చేయనని చెప్పాను. కానీ, అదిరిపోయే సాంగ్ మాత్రం చేయగలనని తెలిపారు. ఆ తర్వాత నేను చేసిన సాంగ్ ‘లుంగీ డ్యాన్స్’. కానీ, ఈ పాట షారుఖ్‌కు పెద్దగా నచ్చలేదు. తనకు ఆ పాట కావాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవడానికి ఏకంగా మూడు వారాల సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ఓకే చేశారు. ఆ పాట ఏ రేంజిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే” అన్నారు.   

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా ‘పఠాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం అట్లీ దర్శకత్వం ‘జవాన్’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రంలో నయనతార, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అటు రాజ్‌కుమార్ హిరానీతో కలిసి ‘డుంకీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది.  చిత్రం 2023 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.  

Read Also: ప్రముఖ గాయకుడు మనోకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసిన రిచ్‌మండ్ గాబ్రియేల్ యూనివర్శిటీ

Published at : 16 Apr 2023 02:49 PM (IST) Tags: Shah Rukh Khan Lungi Dance Honey Singh Chennai Express movie

సంబంధిత కథనాలు

Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!

Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!

రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!

టాప్ స్టోరీస్

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?