Shah Rukh Khan - Dunki Movie : 2023లో హ్యాట్రిక్ మీద కన్నేసిన షారుఖ్ - క్రిస్మస్ బరిలో 'డుంకీ'
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేశారు. 'పఠాన్', 'జవాన్'తో భారీ హిట్స్ అందుకున్నారు. ‘డుంకీ’తో ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘పఠాన్’తో హిట్ ట్రాక్ లోకి షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు 2023 బాగా కలిసి వచ్చింది. సరైన హిట్ లేక చాలా కాలం ఇబ్బంది పడిన ఆయనకు ‘పఠాన్’ ఓ రేంజిలో బూస్టింగ్ ఇచ్చింది. జాన్ అబ్రహాం, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించిన ‘పఠాన్’ మూవీ ఈ ఏడాది జనవరి 25న విడుదల అయ్యింది ఈ చిత్రం షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకుపైగా వసూళు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి షో నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో షారుఖ్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి అడుగు పెట్టారు.
బాక్సాఫీస్ దగ్గర ‘జవాన్’ హవా
ఇక షారుఖ్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ ను అద్భుతంగా అలరిస్తూ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 700 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ మూవీలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యాయి. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించింది. అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు.
షారుఖ్ ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?
ఇక షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ అద్భుత విజయాన్ని అందుకోవడంతో ఆయన రాబోయే చిత్రం ‘డుంకీ’ (Dunki Movie)పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను తాజాగా షారుఖ్ ఖాన్ కొట్టిపారేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా(డిసెంబర్ 22) విడుదల కానున్నట్లు తెలిపారు. ఇటీవల, ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలవుతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ‘జవాన్’ సక్సెస్ మీట్‌లో షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ విడుదల తేదీని మరోసారి కన్ఫామ్ చేశారు. “మేము జనవరి 26న ‘పఠాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. ‘జవాన్’ జన్మాష్టమికి విడుదలైంది. క్రిస్మస్ కానుకగా ‘డుంకీ’ విడుదల అవుతుంది” అని షారుఖ్ తెలిపారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్నది. సంజయ్ దత్ సహా పలువురు నటీనటులు ఈ మూవీలో కనిపించబోతున్నారు. మొత్తంగా ఈ చిత్రంతో షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయంగా భావిస్తున్నారు ఆయన అభిమానులు.
View this post on Instagram
Read Also: 'గేమ్ ఛేంజర్'లో సాంగ్ లీక్ - తమన్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial