Game Changer Son Leaked : 'గేమ్ ఛేంజర్'లో సాంగ్ లీక్ - తమన్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో సాంగ్ లీక్ అయ్యింది. ఆ తర్వాత తమన్ మీద మరోసారి ట్రోల్స్ మొదలు అయ్యాయి.
'గేమ్ ఛేంజర్' సినిమాకు మరోసారి లీకుల బెడద తగిలింది. ఇంటి దొంగలు ఎవరో ఈసారి లీకులకు కారణమని చిత్రసీమ వర్గాలు భావిస్తున్నారు. ఎందుకంటే... ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రి, విశాఖ పరిసర ప్రాంతాల్లో జరిగినప్పుడు జనాలను కంట్రోల్ చేయడం, వాళ్ళ చేతుల్లో మొబైల్స్ లేకుండా చూడటం కష్టం కనుక ఆ షూటింగ్ ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఈసారి అలా కాదు. ఏకంగా ఓ సాంగ్ లీక్ అయ్యింది.
తమన్ మీద మళ్ళీ ట్రోల్స్ షురూ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie)కు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా పాటలు ఏవీ విడుదల కాలేదు. కానీ, ఓ సాంగ్ నెట్టింట లీక్ అయ్యింది.
శంకర్ సినిమాల్లో ఒక మాస్ సాంగ్ కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్... విక్రమ్, సదా జంటగా నటించిన 'అపరిచితుడు'లో 'కొండా కాకి కొండేదానా... రండక రండక' సాంగ్ తరహాలో! ఇప్పుడు లీక్ అయిన సాంగ్ కూడా అలాగే ఉంది. అయితే... దాని మీద విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా 'జరగండి జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్ వేసుకుని వచ్చెనండీ' లిరిక్స్ ఏమిటి? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. సినిమా నుంచి తమన్ (Thaman Trolls)ను తీసేయాలని కొందరు కోరుతున్నారు. అదే సమయంలో ఆయనకు రామ్ చరణ్ అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. తమన్ మీద తమకు నమ్మకం ఉందని పోస్టులు చేస్తున్నారు.
Also Read : నా ప్రతి కన్నీటి చుక్కకూ బాధ పడ్డారు, ఫ్యాన్స్‌కు పాదాభివందనం - 'సైమా'లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
Thaman Beats 🔥🥵
— ChanduRcCult (@ChanduCultRC) September 15, 2023
Inka Shankar Range Visuals RC Grace nd Screen presence ki Sachpothamu emo 🙏🤙#GameChanger pic.twitter.com/cbLEHyOP8Y
Song vinnaka prathi okkari reaction @MusicThaman ni tiseyandi plz #Gamechanger pic.twitter.com/uPOla6eRA0
— Sandhi Naveen (@sanapowerstar) September 15, 2023
#GameChanger
— RC Sena😎 (@RCSena1) September 15, 2023
We believe you @MusicThaman Bhai💥💥💥💥@shankarshanmugh sir ultra visuals 💫💫@AlwaysRamCharan Anna Grace🕺🔥🔥💫 @advani_kiara beauty🤩
Madly waiting to see on big screens 2024💯🙏 pic.twitter.com/nZswLWQyso
అది బేసిక్ సాంగ్... ఫైనల్ కాదు!
'గేమ్ ఛేంజర్' నుంచి లీక్ అయిన సాంగ్ బేసిక్ కంపోజింగ్ వెర్షన్ అని, ట్రాక్ సింగర్స్ పాడారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ కాపీ వేరే ఉందని తెలిపాయి. సౌండ్ మిక్సింగ్ అయ్యాక మరింత బావుంటుందని చెబుతున్నారు.
The leaked song is a very basic composing version of it. Please refain from spreading it and forming opinions based on it. The singers are also basic track singers and not final. A very inferior copy of the final copy.
— .... (@ynakg2) September 15, 2023
Also Read : 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగమ్మాయి అంజలి మరో కథానాయిక. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో రామ్ చరణ్ భార్యగా కనిపించనున్నారని సమాచారం. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శంకర్ చెప్పినప్పుడు అప్డేట్స్ వస్తాయి!
మరో వైపు మెగా అభిమానులు 'గేమ్ ఛేంజర్' అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ 'గాంఢీవధారి అర్జున' ప్రీ రిలీజ్ వేడుకలో ''మన చేతుల్లో ఏమీ లేదు. డైరెక్టర్ (శంకర్) గారు ఇచ్చినప్పుడు డీటెయిల్స్ బయటకు వస్తాయి. మనం ఏమీ చేయలేం అమ్మా'' అని 'దిల్' రాజు క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial