By: ABP Desam | Updated at : 13 Feb 2023 02:42 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@SRKCHENNAIFC/twitter
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార, బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ సినిమాలో నటిస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా షారుఖ్ చెన్నైకి వచ్చారు. షూటింగ్ అనంతరం మర్యాద పూర్వకంగా ఆయన నయనతార ఇంటికి వెళ్ళాడు. కాసేపు నయన్ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తిరిగి వెళుతుండగా కారులో కూర్చున్న షారుక్ ఖాన్ బుగ్గపై నయనతార ముద్దు పెట్టింది. పబ్లిక్ గా నయనతార షారుఖ్ కు కిస్ పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
1 more Exclusive Video: Welcome King 👑 @iamsrk in Namma #CHENNAI
Nayanthara saying goodbye to SRK & King gave good bye kiss 🥹😭
Our #Chennai team reached to capture @iamsrk sir in our camera 📸
We clicked #ShahRukhKhan𓀠 while leaving at #Nayanthara’s apartment in #CHENNAI pic.twitter.com/7trHm571eW — ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) February 11, 2023
కొంత మంది ఈ వీడియోపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. పెళ్లైన మహిళ పబ్లిక్ గా ముద్దులు పెట్టడం ఏంటని విమర్శలు మొదలు పెట్టారు. అయితే, ఈ ట్రోలింగ్ పై ఇటు నయనతార, అటు షారుఖ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్నేహానికి, కామానికి ఉన్న తేడా తెలియని వాళ్లు కూడా సోషల్ మీడియాలో చెత్త కామెంట్లు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు.
అటు చెన్నైకి వెళ్లిన షారుఖ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో, కొద్ది సేపు అభిమానులతో సెల్ఫీలు దిగారు. అందరినీ నవ్వుతూ పలకరించారు. తన కారు సైడ్ నుంచి నిలబడి అభిమానులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే అట్లీ భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి షారుఖ్ అట్లి ఇంటికి వెళ్లారు. కాసేపు వాళ్ల చిన్నారితో ఆటలు ఆడుకున్నారు.
‘జవాన్’ సినిమాతో అట్లీ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక రోల్స్ చేస్తున్నారు. దీపికా పదుకొణె క్యామియో రోల్ లో మెరవనున్నారు. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఇక షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీతో పాటు రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తోంది. ఇక షారుఖ్ తాజాగా ‘పఠాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె, డింపుల్ కపాడియా, అశుతోష్ రానా కీలక పాత్రలు పోషించారు.
Reda Also: లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు, అజిత్ లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్యర్చపోవాల్సిందే!
Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?
Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !
NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం