Vishnu Priya: వారెవ్వా, అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపిన మానస్, విష్ణుప్రియ
బిగ్ బాస్ షోలో గుర్తింపు పొందిన మానస్, యాంకర్ గా అలరించిన విష్ణుప్రియ కలిసి ‘జరీ జరీ పంచె కట్టి‘ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది..
బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులేసింది. తన అందాలను ఆరబోస్తూ దుమ్మురేపేలా చిందులేసింది. ‘‘జరీ జరీ పంచెకట్టి..’’ అంటూ ఊర మాస్ సాంగ్ లో మానస్ తో కలిసి కుర్రకారు మతులు పోగొట్టింది. మాస్ మెచ్చే బీట్ తో అందిరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి అద్భుంగా పాడారు. ఈ పాటకు తగినట్లుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. అదిరిపోయే సెట్ లో అదుర్స్ అనిపించేలా ఇద్దరూ స్టెప్స్ వేశారు. ఈ పాటలో విష్ణు ప్రియను చాలా కొత్తగా కనిపించింది. సాంప్రదాయ వస్త్రధారణలోనే ఎంతో అందంగా.. అంతకు మించి గ్లామర్ తో ఆకట్టుకుంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పుల్లో విష్ణు ప్రియ ఇరగదీసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ధూంధాం చేస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మంచి డ్యాన్సర్ గా, నటుడిగా సత్తా చాటుకున్నాడు మానస్. తాజాగా ఆయనలోని డ్యాన్సర్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఈ నేపథ్యంలోనే యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియతో కలిపి ఓ ప్రైవేట్ సాంగ్ రూపొందించారు. ఇందులో విష్ణు ప్రియ, మానస్ అదరగొట్టేశారు. ఇప్పటి వరకు పలు ఈవెంట్లలో మంచి స్టెప్పులు వేసిన విష్ణుప్రియ తొలిసారి తనలోని టాలెంట్ అంతా బయటకు తీసింది. మానస్ తో కలిసి సూపర్ డూపర్ డ్యాన్స్ చేసి వారెవ్వా అనిపించింది. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ అందుకుంది. సినిమా పాటకు మించి ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విష్ణు ప్రియ హాట్ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఇప్పుడు ఆమె డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. విష్ణు ప్రియ ఇంత మంచి డ్యాన్సరా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పాటతో మానస్, విష్ణుప్రియ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం అంటున్నారు.
ఇక బిగ్ బాస్ ఐదో సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టి మానస్ బాగా పాపులర్ అయ్యాడు. అంతకు ముందు కొన్ని సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్స్ కంటే ముందే చైల్డ్ ఆర్టిస్టుగా ఫేమస్ అయ్యాడు. మొత్తంగా బిగ్ బాస్ రియాలిటీ ఫోతో అద్భుత గుర్తింపు అందుకున్నాడు. ఐదో సీజన్ లో చక్కటి ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాడు. ఈ షోలో చిన్న చిన్న గొడవలు మినహా ఆయన ప్రవర్తన అందరినీ ఆకట్టుకునేలా చేసింది. బిగ్ బాస్ తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం కొన్ని సీరియల్స్ చేస్తున్నాడు. అటు విష్ణుప్రియ ఈటీవీ, స్టార్ మాతో పాటు జీ తెలుగులో పలు షోలు చేస్తున్నది. ఆయా షోలలో తన డ్యాన్సులో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నది.