Seethe Ramudi Katnam Serial Today March 24: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఫోన్ కోసం మహాలక్ష్మీ ఇంటికి తిరిగి వచ్చిన శివరామకృష్ణ...మిథునను చూసి ఏం చేస్తాడు..?
Seethe Ramudi Katnam Today Episode : మిథునను వెనక నుంచి కౌగిలించుకున్న గౌతమ్ గతేంటి..? తండ్రి శివరామకృష్ణపై మిథున చేయిచేసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి..?

Seethe Ramudi Katnam Serial Today Episode Seethe Ramudi Katnam Serial Today Episode: ఒంటరిగా ఉన్న మిధునను వెనకి నుంచి గౌతమ్ కౌగిలించుకుంటాడు. అప్పటి వరకు రామ్‌తో మాట్లాడిన మిధున...రామే వచ్చి కౌగిలించుకున్నాడనుకుని సంతోషిస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా...గౌతమ్ కనిపిస్తాడు. కోపంతో గౌతమ్ చెంప పగులగొడుతుంది.మహాలక్ష్మీ సహా అందరిని పిలిచి అందరికీ చెబుతుంది.అందరిముందు మరోసారి చెంప పగులగొడుతుంది. ఇంటికి వచ్చిన అతిథితో అమర్యదగా ప్రవర్తించండతో జనార్ధన్ కూడా గౌతమ్‌నే తిడతాడు. మధ్యలో కల్పించుకున్న మహాలక్ష్మీ గౌతమ్ కావాలని అలా చేయలేదని...పొరపాటున జరిగి ఉంటుందని అంటాడు. రామ్ కూడా గట్టిగా నిలదీసే సరికి...కాలుజారి కిందపడబోతూ మిధునను పట్టుకున్నానని గౌతమ్ అబద్దం చెబుతాడు. దానికి తను అపార్థం చేసుకుని కొట్టిందని చెబుతాడు. దీంతో మహాలక్ష్మీ మిథునకు సారీ చెప్పమని చెప్పడంతో గౌతమ్ మిథునకు, రామ్‌కు సారీ చెబుతాడు.
మిథున కాఫీ అడగటంతో మహాలక్ష్మీ స్వయంగా వెళ్లి కాఫీ తీసుకుని వస్తుంది. వెంటనే ఆ కాఫీ కప్పును మిథున విసిరివేస్తుంది.ఇలాంటి చెత్త కప్పుల్లో కాఫీ ఎలా తాగుతారని మండిపడుతుంది. తన కారులో కాఫీ ప్లాస్క్‌తో పాటు కప్పులు ఉన్నాయని చెప్పడంతో అర్చన వెళ్లి తీసుకొస్తుంది. పదివేలు విలువ చేసే గోల్డ్ కోటింగ్ ఉన్న కప్పులో మిథున కాఫీ తాగడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఏకంగా బంగారంతో తయారు చేసిన 50 లక్షల విలువైన ఫ్లాస్క్ చూసి అందరికీ మైండ్ పోతుంది. తాను తాగిన కప్పును వాచ్‌మెన్‌కు ఇచ్చేస్తుంది.తాను ఒక్కసారి తాగిన కాఫీకప్పులో మరోసారి తాగనని చెబుతుంది. 10 వేల రూపాయల కాఫీ కప్పుతో ఒక‌్కసారే తాగడంతో అందరూ కళ్లు తెరుస్తారు. అలాగే తాను భోజనం చేసే ప్లేట్ ఖరీదు కూడా 25 వేల రూపాయలని...అది కూడా ఒకసారి తిన్న తర్వాత పడేస్తానని మిథున చెబుతుంది. రోజువారీ ఖర్చే లక్షరూపాయలకు పైగా ఉంటుందని చెబుతుంది. దీంతో రామ్ మిథునపై మండిపడతాడు.మీనాన్న కష్టపడి సంపాధించిన డబ్బు ఇలా తగలెస్తున్నావని అంటాడు. మా నాన్న సంపాధించేది తనకోసమే కదా అంటుంది.
ఇంతలో మరిచిపోయిన ఫోన్ తిరిగి తీసుకుందామని శివరామకృష్ణ అక్కడికి వస్తాడు. అప్పుడే అర్చన, మహాలక్ష్మీ కూడా అసలు మిథున,సీతా ఒక్కరో కాదో నేడు తేలిపోతుందని సంబరపడిపోతారు. అటు తిరిగి ఫోన్ మాట్లాడుతున్న మిథునను చూసి ఈ అమ్మాయి ఎవరని శివరామకృష్ణ అడుగుతాడు. తను సీతలా ఉండే మిథున అని మహాలక్ష్మీ చెబుతుంది. ఇటు తిరిగి నన్నెందుకు వింతలా చూస్తున్నావని నిలదీస్తుంది. వాళ్లందరూ ఆయన సీత నాన్న అని చెబుతారు. ఎవరు ఆమె అనడగ్గా...మిలీనియర్ ముఖర్జీగారి కుమార్తె అని మహాలక్ష్మీ శివరామకృష్ణకు చెబుతుంది. అమెరికాలో చదువుకుని వచ్చిందని చెబుతారు. సీతను, మిథునను పోల్చి చెప్పడంతో రామ్ తీవ్రంగా మండిపడతాడు.
తాను మిథుననే అని మహాలక్ష్మీ, అర్చనను నమ్మించాలంటే ఇంకాస్త డోస్ పెంచాలని మిథున అనుకుంటుంది.శివరామకృష్ణ దగ్గరకు వెళ్లి...కూతురుని ఎలా పెంచాలో తెలియదా అంటూ నిలదీస్తుంది. నా కుమార్తె గురించి మాట్లాడేఅర్హత లేదని శివరామకృష్ణ మండిపడతాడు. నీ కూతురు ఇంట్లో ఒకరిని చంపిందని...మరోకొకరిని చంపబోయిందని అంటుంది. నీ ఇంట్లోనే క్రిమినల్స్‌ను పెట్టుకుని ఇక సొసైటీని ఏం కాపాడతావని విమర్శిస్తుంది. దీంతో శివరామకృష్ణ మరింత మండిపడతాడు. అప్పుడు మహాలక్ష్మీ, అర్చన తెగ సంబరపడిపోతారు. వీళ్లిద్దరూ నిజంగా తండ్రీ,కూతుళ్లు కాదని...సీత అయితే వాళ్ల నాన్నను అలా నిలదీసేది కాదని అనుకుంటారు. ఇంతలో రామ్ కలుగుజేసుకుని మా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చవద్దని మిథునను హెచ్చరిస్తాడు. అయినా సరే మిథున సీతను తిడుతూ శివరామకృష్ణను రెచ్చగొడుతుంది. ఆ కోపంలో మిథున శివరామకృష్ణ చెంపపగులగొట్టడంతో ఈరోజు ఏపిసోడ్ ముగుస్తుంది.



















