అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Seetha Kalyana Vaibhogame: మళ్ళీ తెరపైకి మిర్యాలగూడ అమృత, ప్రణయ్ ప్రేమకథ!

మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ ప్రేమకథ... ప్రణయ్ హత్యకేసులో మారుతి రావు జైలుకు వెళ్లడం ప్రజలకు తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రేమకథ మరోసారి తెర మీదకు వస్తోంది.

మిర్యాలగూడలో అమృత - ప్రణయ్ ప్రేమకథ ఓ సంచనలం. ప్రణయ్ హత్య తర్వాత జరిగిన అమృత తండ్రి మారుతి జైలుకు వెళ్లారు. అప్పట్లో కొందరు కుమార్తెకు, కొందరు తండ్రికి మద్దతు పలికారు. 'క్రాక్'లో విలన్ (సముద్రఖని) కుమార్తె ప్రేమకథ, పెళ్లి ఎపిసోడ్‌కు అదే స్ఫూర్తి. 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సినిమాలో బాలాదిత్య, అర్చన ఎపిసోడ్‌కు అమృత - ప్రణయ్ ప్రేమకథే స్ఫూర్తి. అయితే... ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో సినిమా రాలేదని చెప్పాలి. 'దిల్' రాజు నిర్మాణ సంస్థలో దర్శకత్వ శాఖలో పని చేసిన సతీష్ పరమవేద సీరియ‌స్‌గా సినిమా చేస్తున్నారు.
 
సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. ఇందులో అమృత - ప్రణయ్ ప్రేమకథ, అమృత తండ్రి మారుతీరావు సమస్యను మేళవించి ఫిక్షనల్ స్టోరీ రాశానని దర్శకుడు తెలిపారు. సతీష్ పరమవేద మాట్లాడుతూ "అందరూ రామాయణం వినే ఉంటారు. సీతను రావణాసురుడు అపహరిస్తే... అతడితో రాముడు యుద్ధం చేసి, భార్యను వెనక్కి తెచ్చుకున్నాడు. రాముడికి హనుమంతుడు, వాలి, సుగ్రీవులు మద్దతు ఇచ్చారు. ఈ యుద్ధంలో ఎక్కడైనా సీత తండ్రి జనకుడు కనిపించారా?ఆయనేం చేశారు? ఈ పాయింట్ బేస్ చేసుకుని... నల్గొండలోని మిర్యాలగూడలో  జరిగిన ప్రణయ్ - అమృత ప్రేమకథ, మారుతి రావు వివాదం మేళవించి ఓ కల్పిత కథ రాశా. ఫామిలీ ఎమోష‌న్స్‌తో కూడిన‌ వైల్డ్ యాక్షన్ సినిమా ఇది" అని చెప్పారు.
 
సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న 'సీతా కళ్యాణ వైభోగమే' శుక్రవారం హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి  'దిల్' రాజు సోదరుని కుమారుడు, నిర్మాత హర్షిత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇచ్చారు. 'నాంది'తో దర్శకుడిగా పరిచయమైన విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మునుగూడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి మామిడి హరికృష్ణ అతిథులుగా హాజరయ్యారు.
 
"సతీష్‌తో 'ఊరికి ఉత్తరాన' తీశాం. ఆ చిత్రానికి మంచి పేరొచ్చింది. ఇప్పుడీ సినిమా ప్రారంభించాం. ప్రేమ వివాహం తర్వాత అమ్మాయి తండ్రి పడే బాధ, అమ్మాయి కుటుంబం ఎదుర్కొనే ఇబ్బందులు, సవాళ్ల నేపథ్యంలో 'సీతా కళ్యాణ వైభోగమే' ఉంటుంది. మాకు 'దిల్' రాజు గారు పెద్ద దిక్కు. ఆయన ఆశీర్వాదం, మద్దతుతో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి... ప్రొడక్షన్ నంబర్ 1గా ఈ సినిమా చేస్తున్నాం" అని నిర్మాత రాచాల యుగంధర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, హీరో సుమన్, హీరోయిన్ గరీమ చౌహన్, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget