Seba Transfer Lyrical: వేదనలో వేడుకలా వెలుగు సెబా - రాజాధి రాజా!
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన 'సెబాస్టియన్ పీసీ 524'లో నుంచి 'సెబా...' లిరికల్ వీడియో ఈ రోజు విడుదలైంది.
కంటిలోన చీకటిని, గుండెలోన దాచుకుని...
వేదనలో వేడుకలా వెలుగు సెబా...
రాజాధి రాజా!
వదిలిపోని వేకువని, తిరుగులేని రేపటిని...
ఏలుకొనే ఏలికలా ఎదురు సెబా...
రాజాధి రాజా!
- 'సెబాస్టియన్ పీసీ 524'లో 'సెబా...' పాటలో సాహిత్యం ఇది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రచార చిత్రాలు మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా అనే ఫీలింగ్ కలిగించాయి. 'హేలి...' సాంగ్ చూస్తే... సినిమాలో ప్రేమకథ, రొమాన్స్ కూడా ఉంటుందని తెలిసింది. అయితే... బరువైన సాహిత్యంతో కూడిన 'సెబా...' పాట సినిమాలో కంటెంట్ మరింత ఉందనే అంచనాలు కలిగించింది.
'రాజా వారు రాణి గారు', 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం' విజయాల తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'సెబాస్టియన్ పీసీ 524'. ఇందులో నువేక్ష (నమ్రతా దరేకర్) కథానాయిక. మరో హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఆమెది కీలక పాత్ర అని తెలిసింది. ఈ సినిమా 'సెబా...' పాటను ఈ రోజు విడుదల చేశారు.
'సెబాస్టియన్ పీసీ 524' సినిమా కథకు వస్తే... సెబాస్టియన్ ఓ పోలీస్ కానిస్టేబుల్! అతడికి రేచీకటి... నైట్ బ్లైండ్ నెస్ అన్నమాట! సాయంత్రం ఆరు దాటితే కళ్లు కనపడవు. తల్లి ఏమో ఎవ్వరికీ ఆ విషయం చెప్పొద్దని చెప్పింది. అందుకని, చెప్పలేదు. కానిస్టేబుల్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అక్కడ రాత్రిపూట డ్యూటీ వేశారు. అప్పుడు ఏం చేశాడు? ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలి.
శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ తదితరులు నటించిన ఈ సినిమాను ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. 'సాహో', 'హీరో' సినిమాల తర్వాత జిబ్రాన్ సంగీతం అందించిన తెలుగు చిత్రమిది.
Also Read: 'శ్రీవల్లి' సాంగ్ బెంగాల్ వెర్షన్ చూశారా? ఆ సాంగ్ పాడిన టాప్ సింగర్ ఎవరో తెలుసా?
Also Read: 'వలిమై' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram