Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' ట్రైలర్ - 105 షాట్స్ తో సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్
మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఇప్పటికే సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు. పాటలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. మే2న సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ లో ఓ రేంజ్ లో ఉండబోతుందని ఈరోజు చిన్న ప్రోమోను వదిలారు. 105 షాట్స్ తో మహేష్ బాబు ట్రైలర్ ఉండబోతుందని అనౌన్స్ చేశారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే.
బ్యాంకింగ్ రంగంలో జరుగుతోన్న అవినీతి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also Read: బ్రేకప్ తో బిజీగా ఉన్నావా? షణ్ముఖ్ పై నాగార్జున సెటైర్లు
Also Read: రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'సమ్మతమే' టీజర్
Delivering 105 shots of SuperStar's MENTAL MASS SWAG Tomorrow at 4:05 PM 💥💥#SVPTrailer 🔥#SarkaruVaariPaata#SVPOnMay12
— SarkaruVaariPaata (@SVPTheFilm) May 1, 2022
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/6FmqF9QhqO
View this post on Instagram