(Source: ECI/ABP News/ABP Majha)
ఎవర్రా మీరంతా, ఇంత ప్రేమిస్తున్నారు: కార్తీ
హీరో కార్తికి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీ, సూర్యలు చేసే సినిమాలే కాదు.. వారి వ్యక్తిత్వానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే, వారంటే అంత క్రేజ్!
తెలుగు ఇండస్ట్రీలో ఇతర రాష్ట్రాల హీరోలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ భాష సినిమానైనా ఆదరిస్తారు తెలుగు ఆడియన్స్. తమిళ హీరోలు కొంతమందికి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరోల్లో కార్తీ ఒకరు. యుగానికొక్కడు లాంటి వినూత్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు హీరో కార్తీ. తన సోదరుడు హీరో సూర్య ఇమేజ్ ఉన్నా తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని మొదటి సినిమా తోనే మార్కులు కొట్టేశారు కార్తీ. గతేడాది దీపావళికి కార్తీ నటించిన ఖైదీ మూవీ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఆ సినిమాతో తెలుగులో కార్తీ ఇమేజ్ బాగా పెరిగింది. పైగా తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన విక్రమ్ సినిమాకు ఖైదీ సినిమా లింక్ అయి ఉండటం, అందులో కార్తీ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో కార్తీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ప్రస్తుతం హీరో కార్తీ నటించిన చిత్రం 'సర్దార్'. ఈ సినిమాకు సంబంధించి ప్రి రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఎవర్రా మీరంతా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటూ కార్తీ చెప్పిన డైలాగ్ ఈవెంట్ లో నవ్వులు పూయించింది. ఈ ఈవెంట్ లో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడారు. హీరో నాగార్జునతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. నాగార్జున ను ఓ సోదరుడిలా భావిస్తానని అన్నారు. నాగార్జున ఓ సందర్భంలో మాట్లాడుతూ మంచి హీరో కావాలి అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలని అప్పుడే మంచి యాక్టర్ అవుతామని చెప్పిన మాట తనకు ఇప్పటీ గుర్తుందని అన్నారు. తాను అదే ఫాలో అవుతానని చెప్పుకొచ్చారు కార్తీ. ఊపిరి సినిమాలో నాగార్జునతో తనకి మంచి మెమోరీస్ ఉన్నాయని. అవి నా లైఫ్ లో మంచి మెమోరీస్ గా ఎప్పటికి గుర్తిండిపోతాయని అన్నారు. సినిమా పట్ల తనకి మంచి అభిరుచి ఉందని, మణిరత్నం లాంటి గొప్ప దర్శకులను తెలుగులోకి తీసుకొచ్చిన క్రెడిట్ నాగార్జున గారికే దక్కుతుందని పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాలో భాగం అవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నాగార్జున సినిమాలో 'కన్నుల్లో నీ రూపమే' పాట పాడి ఆకట్టుకున్నారు కార్తీ.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో స్పై క్యారెక్టర్ ఎంతో ఆకట్టుకుంటుందని అన్నారు. రెగ్యులర్ స్పై సినిమాలకు భిన్నంగా ఉంటుందన్నారు. ఇది ఇండియన్ స్పై యాక్షన్ మూవీ అని చెప్పుకొచ్చారు. మన రోజువారీ చేసే పనుల్లో డిజిటల్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించామని అన్నారు. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పారు. గతంలో దీపావళి సమయంలోనే ఖైదీ సినిమా రిలీజ్ అయిందని, మళ్ళీ దీపావళి సమయానికి సర్దార్ సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21 న రిలీజ్ కానుంది.
Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!