News
News
X

Samantha: 'యశోద'కి రూ.8 కోట్ల టేబుల్ ప్రాఫిట్ - ఆ రేంజ్‌లో సక్సెస్ అవుతుందా?

'యశోద' సినిమాతో సమంత రేంజ్ ఏంటో చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు.  

FOLLOW US: 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అవుతుంది. 

ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో గర్భవతి రోల్ చేశారు సమంత. ఆ మధ్య విడుదల అయిన టీజర్ ఆకట్టుకుంది. ఈ సినిమాతో సమంత రేంజ్ ఏంటో చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. సమంత సోలోగా నటించిన 'ఓ బేబీ', 'యూటర్న్' వంటి సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఆ తరువాత విడాకుల వ్యవహారం కారణంగా ఆమెపై నెగెటివిటీ ఏర్పడింది. అదే సమయంలో 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. 

ఆ సాంగ్ లో ఆమె గ్లామర్ షోకి జనాలు ఫిదా అయ్యారు. దీంతో అమ్మడు లెవెల్ బాగా పెరిగింది. మరి ఆ పాపులారిటీ మొత్తం గ్లామర్ డోస్ వలన వచ్చిందా..? లేక నిజంగానే సమంత స్టార్ డమ్ పెరిగిందా..?  అనేది తెలియాలంటే మాత్రం 'యశోద' సినిమా రిజల్ట్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ప్రకారం.. ఎలాంటి గ్లామర్ షోకి చోటులేదు. ఇప్పటికే ఈ సినిమాను రూ.8 కోట్ల టేబుల్ ప్రాఫిట్ కి అమ్మినట్లు సమాచారం. ఆ రేంజ్ లో హిట్ అవ్వాలంటే.. సినిమా బాగా ఆడాలి. మంచి రివ్యూస్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా రావాలి. ఒకవేళ ఏవరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం బాగా రావాలి. అప్పుడే సమంత స్టార్ డమ్ ఏంటో ప్రూవ్ అవుతుంది.   

News Reels

హైలైట్ గా యాక్షన్ సీక్వెన్సెస్:

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నారయట. మూడు వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. అందులో ఓ యాక్షన్ సీన్ ని 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్ కి పని చేసిన ఫారెన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2కి పని చేసిన యాక్షన్ మాస్టర్లే ఈ సినిమాకి కావాలని సమంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు వాళ్లతోనే వర్క్ చేయించారు. 

క్లైమాక్స్ కి ముందు ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని.. అందులో సమంత పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంది. మరి ఆ యాక్షన్ ఫీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న 'యశోద' సినిమాలో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి డైలాగ్స్ రాస్తున్నారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. అశోక్ ఆర్ట్  పనులు చూసుకుంటున్నారు. 

Also Read : వసూళ్ల వేటలో 'కాంతార' దూకుడు - మూడో రోజూ రఫ్ఫాడించిన రిషబ్ శెట్టి

Published at : 18 Oct 2022 09:01 PM (IST) Tags: samantha Yashoda Yashoda Movie

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే