Samantha: ఆ ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్న సమంత
సమంత ఓ ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్నారు. ఆ ప్రేమకథ ఏంటి? ఏమైంది? అంటే... వివరాల్లోకి వెళ్ళండి.
సమంత ప్రేమలో పడ్డారు. అదీ సినిమాతో! ఇప్పుడు కాదులెండి, ఎప్పుడో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమకథ మొదలై నేటికి 12 సంవత్సరాలు. ఈ సందర్భంగా సమంత ఒక పోస్ట్ చేశారు. అందులో సినిమాతో తన ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...
"ఈ రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత... చలన చిత్ర పరిశ్రమలో నేను (నటిగా) 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని తెలిసింది. లైట్స్... కెమెరా... యాక్షన్... ఈ 12 ఏళ్ళు వీటితో నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎంతో నమ్మకమైన అభిమానులు నాకు ఉన్నందుకు, ఇంత అదృష్టవంతమైన ప్రయాణం కలిగినందుకు... నా మనసు అంతా కృతజ్ఞతతో నిండి ఉంది. సినిమాతో నా ప్రేమ కథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని... మరింత దృఢంగా అవ్వాలని కోరుకుంటున్నాను" అని సమంత సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
అక్కినేని నాగచైతన్యకు జోడీగా సమంత నటించిన 'ఏ మాయ చేసావె' ఫిబ్రవరి 26, 2010లో విడుదలైంది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో ఆమె నటించారు. తొలి సినిమాలో హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ కథంతా తెలిసినదే. సమంత నటించిన 'శాకుంతలం' విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం 'యశోద' సినిమా చేస్తున్నారు.
Also Read: ఇన్‌స్టాలో సమంత దూకుడు (2.2 కోట్లు) - ఇలియానా జోరు (1.4 కోట్లు)