News
News
X

Samantha Father Joseph Prabhu: నాగ చైతన్యతో విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించి తెలుగు ప్రేక్షకులను షాక్ కు గురి చేశారు. తాజాగా వీరి గురించి సమంతా తండ్రి ఫేస్ బుక్ పోస్టు పెట్టారు..

FOLLOW US: 

తెలుగు సినిమా పరిశ్రమనే కాదు... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసిన ఘటన నాగ చైతన్య, సమంత విడాకులు. ఎంతో సరదాగా కనిపించే ఈ కపుల్ విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విభేదాల కారణంగా విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. పదేండ్ల పరిచయం... నాలుగేళ్ల సంసారం జీవితం వీరి మధ్య కొనసాగింది. కారణాలు తెలియదు కానీ.. పెద్ద ఎత్తున గొడవలు మాత్రం జరిగాయి. తామిద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎవరికి వారు కెరీర్ మీద ఫోకస్ పెట్టారు.

 చైతన్య గురించి సమంత తండ్రి పోస్టు

తాజాగా సమంత తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు బాగా వైరల్ అయ్యింది. వాస్తవానికి సమంత, నాగ చైతన్య విడిపోకూడదని ఇరు కుటుంబాలు చాలా ప్రయత్నించాయి. నాగార్జునతో పాటు సమంత తండ్రి కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని సమాచారం. అయినా వారు ససేమిరా అనడంతో  వీరు విడిపోయారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కూడా తన కుమార్తె విడాకులపై స్పందించారు. సమంత, నాగ చైతన్య విడిపోయిన విషయం తెలిసి తన మైండ్ బ్లాంక్ అయిందన్నారు. విడాకులకు ముదు ముందు ఓ మీడియా పోర్టల్‌ తో మాట్లాడిన ఆయన... పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ , ఆయన ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అయినా... నాగ చైతన్య పట్ల తన ఆప్యాయత అలాగే కొనసాగిస్తున్నారు.

కీలక విషయాలు చెప్పిన సమంత

కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో తన వైవాహిక జీవితం గురించి సమంత కీలక విషయాలు వెల్లడించింది. తమ మధ్య సఖ్యత లేకపోవడం మూలంగానే విడిపోయినట్లు వెల్లడించింది. తమ విడాకులు అంత సులభంగా  జరగలేదని వెల్లడించింది. విడిపోయే సమయంలో తాను ఎంతో బాధకు లోనైనట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ బాధ నుంచి బయటపడినట్లు చెప్పింది. గతంతో పోల్చితే ఇప్పుడు మరితం స్ట్రాంగ్ గా తయారైనట్లు తెలిపింది.  తామిద్దరం విడిపోయినప్పుడు తనపై నెగెటివ్ ప్రచారం బాగా జరిగిందని చెప్పింది. ఆ సమయంలో స్పందించాలి అనుకున్నా... స్పందించలేకపోయినట్లు వెల్లడించింది.

ఆ కథ ఇప్పుడు లేదు..

ఒక వైపు చైతన్యతో తన  పరిస్థితులు బాగా లేవని సమంత చెబుతోంటే... ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మాత్రం వీరు విడిపోయిన షాక్ నుంచి ఇంకా బయట పడనట్లే కనిపిస్తుంది. తాజాగా ఆయన ఫేస్ బుక్ లో చేసిన పోస్టు ఇందుకు బలాన్ని ఇస్తుంది. తన ఫేస్‌బుక్ పేజీలో జోసెఫ్ ప్రభు ఇటీవల సామ్, చైల వివాహానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. మెలాంకోలిక్ క్యాప్షన్‌లో... చాలా కాలం క్రితం ఒక కథ ఉందని, అది ఇప్పుడు లేదని ఆయన బాధపడ్డారు. 'ఏ మాయ చేసావే' సినిమాతో చైతన్య, సమంత తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించారు.  వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.  2017లో చై, సామ్ వివాహం జరిగింది. నాలుగు సంవత్సరాలకు వీరిద్దరు విడిపోయారు.

Published at : 06 Sep 2022 06:42 PM (IST) Tags: Naga Chaitanya Samantha Ruth Prabhu Joseph Prabhu facebook post Samantha Father On Chay

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి