Samantha: బికినీలో సమంత... న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడేనా!?
సమంత మరోసారి బికినీలో సందడి చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆమె సముద్ర తీర ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం.
డ్రస్సింగ్ విషయంలో సమంత రూటే సపరేటు! సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ మేరకు డ్రస్‌లు వేసుకుంటారు. ప్రచార కార్యక్రమాల్లో సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తారు. స్నేహితులు లేదా ఫ్యామిలీతో కలిసి టూర్లు వేసినప్పుడు బికినీల్లో సందడి చేస్తారు. గతంలో మాల్దీవులు వెళ్లినప్పుడు బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత.
లేటెస్టుగా మరోసారి బికినీ లాంటి మోనోకినీ ధరించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత షేర్ చేశారు. అందులో ఆమెతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ స్టయిలిస్ట్ శిల్పా రెడ్డి, మోడల్ అండ్ ఎంట్రప్రెన్యూర్ వాసుకి పుంజ్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ గోవాలో విహరిస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే ప్లాన్ చేసినట్టు సమాచారం.
Also Read: సమంత 'యశోద'లో వీళ్లూ నటిస్తున్నారు... భారీ తారాగణమే ఉందిగా!
ఈ ఏడాది సమంత వ్యక్తిగత జీవితంలో భారీ మార్పు చోటు చేసుకుంది. అక్కినేని నాగ చైతన్య, ఆమె విడాకులు తీసుకున్నారు. మరోవైపు వృత్తిపరమైన జీవితంలో ఆమెకు విజయాలు వచ్చాయి. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు, పేరు తీసుకు వచ్చాయి. 'పుష్ప: ద రైజ్'లో ఆమె ప్రత్యేక గీతం చేసిన సంగతి తెలిసిందే. 'ఊ అంటావా... ఊఊ అంటావా' సాంగ్ థియేటర్లలో ఓ ఊపు ఊపుతోంది.
View this post on Instagram
Also Read: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!
Also Read: విడాకుల తర్వాత చనిపోతాననుకున్నా! కానీ... - సమంత
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకులపై సమంత స్పందన
Also Read: సంపదకు సమంత ఇచ్చిన నిర్వచనం ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి